Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 దాదాపు 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ 50 రోజులు కూడా ట్విస్టులు మీద ట్విస్టులు ఇస్తున్నారు. ఇప్పటికే 8 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. వైల్డ్ ఫైర్ లో భాగంగా ఆరుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రతి సోమవారం నామినేషన్స్ జరుగుతాయి అనే విషయం తెలిసింది.
ముఖ్యంగా నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చాలామంది ఎదురు చూసేదే నామినేషన్ కోసం. ఎందుకంటే ఒక్కరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు అవతలి వాళ్లకు కోపం వస్తే అసలైన ఒరిజినాలిటీ బయట పడుతుంది. కాబట్టి నామినేషన్స్ డే కోసం చాలామంది ఎదురు చూస్తారు.
ఇకపోతే ఈ వారం నామినేషన్స్ చాలా డిఫరెంట్ గా జరిగాయి. వైల్డ్ ఫైర్ వాళ్లు ఆల్రెడీ ఉన్న వాళ్ళని ముందు నామినేట్ చేశారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ వాళ్లలో వాళ్లు నామినేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే హౌస్ నుంచి ఆల్రెడీ బయటికి వెళ్లిపోయిన వాళ్ళని లోపలికి పిలిపించు మరి ఈ వారం నామినేషన్స్ పెట్టారు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు హౌస్ లోకి వచ్చి నామినేట్ చేయడం వలన ఈ ఎపిసోడ్ ఇంకొంచెం ఆసక్తికరంగా మారింది.
ఫ్లోరా సైనీ.. రీతూను నామినేట్ చేశారు. దాని రీజన్ చాలా సిల్లీగా ఉంది. తనూజ పడిపోయినప్పుడు కళ్యాణ్ ఏడ్చాడు. అది చూసి రీతూ నవ్విందని, వచ్చినప్పటి నుంచి ఫేక్ గేమ్, ఫేక్ రిలేషన్స్ గేమ్ గెలవాలని చూస్తుందని నామినేట్ చేసింది. ఇది ఒకే.
ఇదంత ఫ్లోరా ఉన్నప్పుడు జరిగింది. అది అందరు అంటున్న పాయింట్స్. కళ్యాణ్ ఏడిస్తే నవ్విందనేది రాంగ్. ఏదో ఫన్నీ రీల్స్, చూసి చేసింది. షో చూసి అర్థం చేసుకుని చేయలేదు. బయట వస్తున్న మీమ్స్, రీల్స్ చూసి చేసింది. రెండు ఇన్ వాలిడ్ పాయింట్స్. తెలుగు రాని వాళ్లను తీసుకుంటే ఇలాగే ఉంటుంది. అనేది చాలామంది అభిప్రాయం.
నామినేషన్ కి సంబంధించి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నప్పుడే చాలామందికి ఒక అభిప్రాయం కలుగుతుంది. కానీ కొన్ని సిల్లీ రీజన్స్ పెట్టుకొని ఒకరిని నామినేట్ చేస్తే షో మీద ఉన్న అభిప్రాయం కూడా కొంతమంది వీక్షకులకు పోతుంది అనేది వాస్తవం. అయితే ఫ్లోరా రీతుని నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఫీలింగ్ చాలామందికి కలిగింది.
Also Read: Kingdom : కింగ్డమ్ సినిమాలో మురుగన్ క్యారెక్టర్ వదులుకున్న తెలుగు నటుడు