Kingdom : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో గౌతం తిన్ననూరి ఒకరు మళ్ళీ రావా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గౌతం. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమా తర్వాత నాని హీరోగా చేసిన జెర్సీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జెర్సీ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. గౌతమ్ ఆ సినిమాను డీల్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా నచ్చింది.
ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశారు. కొన్ని కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు. మొత్తానికి విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ అనే సినిమా తెరకెక్కించాడు గౌతమ్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో తిరువీరు ఒకరు. అయితే కింగ్డమ్ సినిమాలోని మురుగన్ అనే క్యారెక్టర్ ఎంత బాగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. మలయాళ నటుడు వెంకటేష్ ఈ పాత్రలో నటించాడు. అలానే సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వెంకటేష్ బాగా పాపులర్ అయ్యాడు.
ఆ పాత్రకు విపరీతమైన పేరు వచ్చింది. అయితే ముందుగా ఆ పాత్ర కోసం తిరువీరును అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన బిజీ షెడ్యూల్ వలన తిరువూరు ఆ పాత్రను చేయలేకపోయాడు. ఒకవేళ ఆ పాత్ర తిరువీరు చేసుంటే కెరీర్ కి ఇంకొంచెం ప్లస్ అయ్యేది. ఇక ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు తిరు.
వాస్తవానికి కింగ్డమ్ సినిమాకి విపరీతమైన బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా విషయంలో కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి గౌతమ్ స్ట్రెంత్ ఎమోషన్స్ రాయటం. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు.
సినిమా మీద కూడా విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని అప్పట్లో అనౌన్స్ చేశారు. కానీ కింగ్డమ్ ఫలితం చూసిన తర్వాత సిక్వెల్ వస్తుందా రాదా అనే డౌట్ చాలా మందికి ఉంది. ఏదేమైనా గౌతమ్ లెవెల్లో ఈ సినిమా వర్కౌట్ కాలేదు అనేది వాస్తవం.
Also Read: Spirit: స్పీడ్ పెంచిన ప్రభాస్, స్పిరిట్ షూటింగ్ అప్పుడే మొదలైపోతుంది