Aus vs Ind, 1st T20I: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 1st T20I ) మధ్య టి20 సిరీస్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య వండే సిరీస్ పూర్తయింది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ జరగగా.. కంగారులు ఈ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకున్నారు. ఇక ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య ఐదు టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ ఎల్లుండి అంటే అక్టోబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ ఫైనల్ అయింది. ఈ రెండు జట్ల మధ్య 5 టీ20లు నిర్వహించనున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 29వ తేదీన కాన్ బెర్రా వేదికగా టీమిండియా వర్సెస్ ఇండియా మధ్య మొదటి టీ20 జరగనుంది. అక్టోబర్ 31వ తేదీన మేల్బోర్న్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండవ టి20 జరగనుంది. అలాగే నవంబర్ రెండవ తేదీన టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య హోబర్ట్ వేదికగా మూడవ టి20, గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ ఆరవ తేదీన నాలుగో టీ20 జరుగుతుంది. ఇక నవంబర్ 8వ తేదీన ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బ్రిస్ బెన్ వేదికగా మరో మ్యాచ్ జరుగుతుంది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 1st T20I ) మధ్య టి20 సిరీస్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభం కానుంది. అంటే టాస్ ప్రక్రియ మధ్యాహ్నం 1.15 గంటలకు ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఈ టీ20 సిరీస్ హాట్ స్టార్ లో చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా తిలకించవచ్చు.
ఇండియా స్క్వాడ్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్.
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (C), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్ (గేమ్స్ 1-2), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (WK), మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
Here is our Indian probable XI for the first T20I against Australia. 🇮🇳
Do you agree with the side? 👀#Cricket #India #AUSvIND #Sportskeeda pic.twitter.com/xjFisNyUP1
— Sportskeeda (@Sportskeeda) October 27, 2025