Bigg Boss 9: బిగ్బాస్ సీజన్ 9 లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ తో పాటు సుమన్ శెట్టి కూడా. సుమన్ శెట్టి ఎప్పుడూ నామినేషన్స్ లో ఉన్నా కూడా బయట చాలామంది అభిమానులు తనకి ఉండటం వలన. అలానే అత్యధికంగా ఓట్లు కూడా రావటం వలన తను సేవ్ అవుతూ వచ్చాడు.
ఇక సుమన్ శెట్టి ప్రస్తుతం కెప్టెన్ గా హౌస్ లో కొనసాగుతున్నారు. సుమన్ శెట్టి కెప్టెన్సీ పొగుడుతూ నాగార్జున కూడా మంచి ప్రశంసలు అందించారు. అయితే కెప్టెన్ గా ఉన్న సుమన్ శెట్టికి మరియు సంజనా కి మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి.
ఫ్లోరా వచ్చి రీతూని నామినేట్ చేసింది. మరో కత్తిని సుమన్ శెట్టికి ఇచ్చింది. అతను సంజనను నామినేట్ చేశాడు. డస్టిన్ బిన్ విషయంలో తను మాట్లాడిన తీరు నచ్చలేదని, అక్కడ మీరు అనవసరంగా గొడవపడ్డారు. అని నామినేట్ చేశాడు. అప్పుడే సారీ చెప్పాను కదా అంటే చెంపపై లాగి పెట్టి కొట్టి ఆ తర్వాత సారీ అంటే ఎలా ఉంటుంది.? నువ్వు అనాల్సినవి అన్ని అని సారీ అంటావు అది నీకు అలవాటు అయిపోయింది అన్నాడు సుమన్ శెట్టి.
ఆ తర్వాత బ్రేక్ టైంలో హౌజ్ లో సుమన్ దగ్గరి వెళ్లి గొడవ ఆడింది. నువ్వు అసమర్థుడివి కెప్టెన్ అయ్యి ఉండి డబ్బులు కొట్టేశావు అంటుంది. నీ వల్ల గేమ్ మొత్తం పాడైంది అంటే. అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. నువ్వు 420.. నేను రాబిన్ హుడ్ అంటూ ఆమెకు సెటైర్స్ వేశాడు సుమన్ శెట్టి. అలానే నన్ను తొక్కలో కెప్టెన్ అన్నావు అంటూ సుమన్ శెట్టి సంజనా మీద విపరీతంగా ఫైర్ అయ్యారు. నేను చాలాసార్లు సారీ చెప్పాను అంటూ సంజన మాట్లాడటం మొదలుపెట్టింది. కానీ సుమన్ శెట్టి ఆ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు.
ఇకపోతే హౌస్ లో కొంత మేరకు గెలిచే ఛాన్సెస్ కూడా సుమన్ శెట్టికి ఉన్నాయి అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ యాజమాన్యం అంతా కూడా తనుజాకి సపోర్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి.
అంతేకాకుండా స్టార్ మా అఫీషియల్ అకౌంట్ నుంచి కూడా తనుజాకి ఎలివేషన్ పోస్టులు వస్తున్నాయి. అయితే జెన్యూన్ గా ఆడే ప్లేయర్ కి ఇస్తారా? లేకపోతే స్టార్ మా సభ్యురాలు అయిన తనుజాను ఇలానే సపోర్ట్ చేసి ఫైనల్ వరకు తీసుకొస్తారా అనేది కొంతమందికి ఉన్న సందేహం.
Also Read: Bigg Boss 9 : తెలుగు రాని వాళ్లని తీసుకువస్తే ఇలాగే ఉంటుంది.. అసలు షో చూస్తున్నావా ఫ్లోరా?