Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఎన్నో సమస్యలు ఉన్న సంగతి తెలిసింది. అయితే దీని గురించి సినిమా ప్రముఖులంతా మరొకసారి ఏకమయ్యారు. ఫిలిం ఛాంబర్ కు సంబంధించి ఎలక్షన్స్ పెట్టాలని, అలానే బిల్డింగ్ కూలగొట్టకుండా ఉంచాలి అనేది సినిమా ప్రముఖుల ఉద్దేశం.
సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ పేరుతో సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మురళీ మోహన్, సురేష్ బాబు , శివాజీ రాజా , జెమినీ కిరణ్ , అశోక్ కుమార్ , ఏడిద రాజా, బసిరెడ్డి , విజయేందర్ రెడ్డి, నరసింహారావు , శివనాగేశ్వరరావు , చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు. పాల్గొనడమే కాకుండా తమ ఉద్దేశాన్ని మాట్లాడారు.
ఆనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదు లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిలిం నగర్ సోసైటీలో ఫిలిం ఛాంబర్ ను ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడి స్పేస్ పూర్తిగా చిత్రపరిశ్రమ అవసరాల కోసమే ఉపయోగపడాలి
చైన్నై నుంచి హైదరాబాదు చిత్ర పరిశ్రమ రావటానికి ఫిలిం నగర్ సోసైటీ లో ఫిలిం ఛాంబర్ ను ఇచ్చారు.ఇది కట్టి నలభై ఏళ్లు అయింది. దీనిని చిత్రపరిశ్రమకు సంబందించి తప్ప , వేరె వాటికి ఉపయోగించకూడదు.. వాటిపై ఒక అవగాహన వచ్చాకే కొత్త బిల్డింగ్స్ గురించి ఆలోచించవచ్చు.
చిత్ర పరిశ్రమ స్దిరపడటం కోసం ఇక్కడ ఫిలిం ఛాంబర్ ను ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్కొక్కటిగా ఇండస్ట్రీ కోసం నిర్మాతల సౌకర్యాల కోసం, అనేక ఆఫీసుల ఈ క్లాంప్లెక్స్ లో ఏర్పాట్లు అయ్యాయి. డెవలెప్మెంట్ జరిగితే అది చిత్రపరిశ్రమకే యూజ్ అయ్యేలా ఉండాలి.. ఫిలిం ఛాంబర్ అభివృద్దిపై సినీ పెద్దలు అందరూ కలిసికట్టుగా అందరికీ అమోదయోగ్యంగా ఉమ్మడి నిర్ణయం తీసుకుకోవాలి. అంటూ పలువురు సినిమా ప్రముఖులు తమ ఉద్దేశాన్ని తెలిపారు.
Also Read: Kingdom : కింగ్డమ్ సినిమాలో మురుగన్ క్యారెక్టర్ వదులుకున్న తెలుగు నటుడు