Srija Satirical comments on Madhuri and Tanuja: హౌజ్ లోకి వచ్చాక శ్రీజ ఓవరాక్షన్ మామూలుగా లేదు. ఒకరిని నామినేట్ చేయమంటే ఏకంగా ముగ్గురిని టార్గెట్ చేసింది. వచ్చి రాగానే మాధురిని సెటైరికల్ గా పలకరించింది. ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు. మిమ్మల్ని మాస్ మాధురి అనాలి, మాధురి గారా, రాజుగారా అని తెలియడం లేదు. బయటకు వెళ్లి చాలామందిని అడిగా.. ఆమె మాకే తెలియదు.. నీకేలా తెలుస్తుంది అనుకున్నావ్ అంటున్నారు. దీంతో మాధురి కూడా నాకు కూడా నువ్వు ఎవరో తెలియదు అంటూ తిప్పి కొట్టింది. ఏంటి నువ్వు నాతో గొడవ పడటానికి వచ్చావా? అంటూ శ్రీజపై అసహనం చూపించింది. కావాలని గొడవలు పెట్టుకున్నావ్ బాండింగ్స్ బాగున్నాయా? అంటే హా బాగున్నాయా అంటూ చురకలు అట్టించింది.
ఆ తర్వాత తనూజని టార్గెట్ చేసింది. తనూజ గారూ.. ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని నేషనల్ ప్లాట్ ఫాం మీద క్యారెక్టర్ అససినేట్ చేశారు. లినియస్ ఇస్తేనే, రెండు చేతుల కలిస్తేనే చప్పట్లు ఒక వ్యక్తి అన్నారు.. మళ్లీ అదే వ్యక్తితో రాజు రాజు అంటూ బాండింగ్ పెట్టుకున్నారు. ఇలా ఎంతకాలం సపోర్టు సపోర్టుతోనే గెలవాలి అనుకుంటున్నారు. మొదటి నుంచి బెడ్ టాస్క్ లో భరణి గారు, వాటర్ టబ్ టాస్క్ లో భరణి గారు, ఇమ్యూనిటీ టాస్క్ లో నేను, కళ్యాణ్ ఇలా అందరి టాస్క్ తో గెలుస్తున్నావు. మొన్నటి కంటెండర్ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ మీరూ ఉంటే.. అరేయ్ ఆడపిల్లని నాకు ఇవ్వోచ్చు కదరా..నువ్వు కెప్టన్ ఎప్పుడైనా అవ్వోచ్చు అంటూ కెప్టెన్సీ తీసుకునేందుకు ట్రే చేశావంటూ తనూజని ఎత్తిపొడిచింది. అంతేకాదు మిమ్మల్ని అక్క అనాలి అన్న భయమేస్తుంది.
ఒకవేళ నేను టాప్ 3 లేదా 2 లో ఉండి, కప్ గెలిచినా అరేయ్ అక్క అక్క అంటున్నావ్ కదరా ఆ ట్రోఫి నాకు ఇచ్చేయొచ్చు కదరా అని అంటావేమో అనిపించి మిమ్మల్ని అక్క అని అనబుద్ది కావడం లేదు అంటూ తనూజను విమర్శించింది. ఇలా తనూజపై రెచ్చిపోతున్న శ్రీజ నోటికి ఆఖరికి బిగ్ బాస్ తాళం వేశాడు. బిగ్ బాస్ స్పందిస్తూ.. నువ్వు వచ్చిన పని నామినేషన్ చేయడం.. అది చేస్తే బాగుంటుందంటూ శ్రీజ నోరు మూయించాడు. దీంతో ఆమె ఓవరాక్షన్ తగ్గించి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. కళ్యాణ్ నామినేషన్ తర్వాత మరో కత్తిని మాధురికి ఇచ్చింది. చూస్తా ఎంత బాగా నామినేషన్ చేస్తావో.. బాండింగ్స్ అని చేస్తావో.. నార్మల్ నామినేషన్ చేస్తావా అని ఎత్తిపొడుస్తూనే మాధురి చేతికి కత్తి అందించింది. ఇక మాధురి రీతూని నామినేట్ చేసింది.
ఈ క్రమంలో వారి మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఇద్దరు కొట్టుకుంటారేమో అనేంత వరకు వెళ్లారు. మాధురి పైపైకి వెళ్లడంతో రీతూ కళ్లు మూసుకోని ఆగుతారా? అంటూ కాస్తా వెనక్కి తగ్గింది. లేదంటే ఆ సీన్ ఎక్కడికి వెళ్లేదో మీ ఊహాకే అందాలి. ఇక నామినేషన్ మధ్యలో కలుగజేసుకుని మీరు ముందు 10వేలు ఉన్న లేవని అబద్ధం ఎందుకు చెప్పారు. తనూజ, మీరు డబ్బుల గురించి మాట్లాడుకుంటూ గేమ కానివ్వూ.. చివరికి మిగిలిన డబ్బులన్ని నీకే ఇస్తానంటూ ఫెవరిజం చూపించలేదా అని అంటుంది. దానికి నామినేషన్ నీదా? నాదా? అని మాధురి అసహనం చూపించింది. అంతా అయ్యా జాగ్రత్త రా బయటకు వెళ్లాక బుర్రలు పగలగొడతారేమో అంటూ జుట్టు నేలకేసి కొడతా అంటూ రీతూని మాధురి అన్న మాటలను తిప్పి కొట్టింది. ఈ క్రమంలో శ్రీజ, మాధురిల మధ్య కాస్తా కొల్డ్ వార్ నడిచింది. జస్ట్ గెస్ట్ వస్తేనే ఇంత రచ్చ చేసిన శ్రీజ.. మళ్లీ హౌజ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక హౌజ్ లోకి వచ్చాక ఆమె ఆట ఎలా ఉంటుంది.. మాధురితో తన గేమ్ ఎలా ఉండబోతోతుందో చూడాలి.