BigTV English
Advertisement

Madhuri Vs Ritu: మీది అన్‌హెల్తీ బాండ్.. రీతూ, పవన్‌ దోస్తీపై దివ్వెల మాధురీ కామెంట్స్‌.. నెటిజన్స్‌ రియాక్షన్‌ చూశారా!

Madhuri Vs Ritu: మీది అన్‌హెల్తీ బాండ్.. రీతూ, పవన్‌ దోస్తీపై దివ్వెల మాధురీ కామెంట్స్‌.. నెటిజన్స్‌ రియాక్షన్‌ చూశారా!


Madhuri Comments on Ritu Relations: బిగ్బాస్‌ 9 తెలుగు మూడో ప్రొమో కూడా వచ్చేసింది. రోజు నామినేషన్స్హీట్ మామూలుగా లేదు. నామినేషన్స్చూస్తుంటే రోజు హౌజ్లో రగడ మామూలుగా ఉండదనిపిస్తోంది ప్రొమోలు చూస్తుంటే. తాజాగా విడుదలైన మూడో ప్రొమోలో రీతూని మాధురి నామినేట్చేసింది చూపించారు. ఇక్కడ మాధురి మాట్లాడిన మాటలు నెట్టింట చర్చనీయాంశం అవుతున్నాయి. హెల్తి, అన్హెల్తి బాండ్స్అంటూ మాధురి మాట్లాడటంపై నెటిజన్స్సెటైర్లు వేస్తున్నారు. ఇంతకి అసలేం జరిగిందంటే.

మాధురిని ఎత్తిపొడిచిన శ్రీజ

వీక్నామినేషన్ప్రాసెస్ని బిగ్ బాస్ఎలిమినేటెడ్కంటెస్టెంట్స్చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. ఎలిమినేట్అయిన ఒక్కొ కంటెస్టెంట్కి రెండు కత్తులు ఇచ్చి లోపలికి పంపించి నామినేషన్ప్రక్రియ మొదలుపెట్టించాడు. అలా హౌజ్లోకి ప్రియ, మర్యాద మనీష్, ఫ్లోరా షైనీ, భరణి, శ్రేష్టి వర్మ, శ్రీజ దమ్ములు వచ్చినట్టు తెలుస్తోంది. వీరికి రెండు కత్తులు ఇవ్వగా ఒక కత్తిలో వారు నామినేట్చేయాలనుకున్న కంటెస్టెంట్ని పొడిచి వివరణ ఇవ్వాలని. మరో కత్తిని హౌజ్లో ఉన్న కంటెస్టెంట్కి ఇచ్చి నామినేట్చేయించాలి. అలా హౌజ్లోకి వచ్చిన శ్రీజ.. నిన్ను నువ్వు కూడా కరెక్ట్గా డిఫెండ్చేసుకోకపోతే ఎలా అంటూ నామినేట్చేసింది. మరో కత్తిని మాధురికి ఇస్తూ.. మాటలతోనే ఎత్తిపొడిచింది. ఎంత బాగా నామినేట్చేస్తారో చూస్తా.. బాండింగ్స్అని చేస్తారో, నార్మల్గా చేస్తారో చూస్తా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూనే మాధురికి చేతికి కత్తి అందించింది.


రీతూని నామినేట్

నామినేషన్ రైట్రావడంతో నేరుగా రీతూని పొడిచింది. కళ్యాణ్తో టీంలో ప్రతి ఒక్కరు రీతూని నమ్మొద్దని చెప్పారు. అయినా నిన్ను టీంలోనే పెట్టుకున్నా. కానీ, నువ్వు మా టీం నుంచి సంపాదించుకున్న డబ్బును వేరే టీం మెంబర్స్కి ఎలా ఇస్తావు, పవన్కంటెండర్చేయడమే కోసం హౌజ్కి వచ్చావా? అంటూ మాధురి రీతూని ప్రశ్నించింది. తాను కంటెండర్అయ్యాక తన డబ్బులు తన ఇష్టమని, ఎవరికైనా ఇచ్చుకుంటా అంటూ రీతూ తనని డిఫెండ్చేసుకుంది. రీతూ పవన్కి సపోర్టు చేస్తుందని మాధురి అంటుంటే.. మీరు ఎందుకు వచ్చారు తనూజకి తప్ప ఎవరికి సపోర్టు చేయడం లేదంటూ తిరిగి మాధురికి కౌంటర్ఇచ్చింది. తనూజని సపోర్టు చేయడానికి హౌజ్కి వచ్చారంటూ రెచ్చిపోయింది.

మీది అన్హెల్తీ బాండింగ్

తనూజతో మీది బాండ్కాదా, వాళ్లిందదరిది బాండ్కాదా అంటూ రీతూ ప్రశ్నిస్తుంటే.. వాళ్లందరివి హెల్తి బాండింగ్స్.. మీది అన్హెల్తీ బాండ్అంటూ రీతూ మీద వెళ్లింది. అయితే మాధురి హెల్తి, అన్హెల్తి బాండ్అంటూ మాట్లాడటంపై నెటిజన్స్ నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. రిలేషన్స్గురించి మాధురి మాట్లాడటం వింతగా ఉందని, రీతూ అలా అంటున్న ఆమె బయట చేస్తుంది ఏంటి? దువ్వాడ శ్రీనివాస్తో తన రిలేషన్ఏంటి? అన్హెల్తి బాండింగ్స్గురించి రీతూ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందంటూ కామెంట్స్చేస్తున్నారు. మరికొందరేమో తను హౌజ్లో వరకే మాట్లాడుతుంది పర్సనల్లైఫ్ని ఇక్కడకు తీసుకురాకండంటూ ఆమె సపోర్టర్స్కామెంట్స్చేస్తున్నారు. ఇక మాధురిలో అంత రెచ్చిపోతున్న రీతూ మాత్రం తన హద్దులు దాటటం లేదని, చాలా కరెక్ట్గా తనని తాను డిఫెండ్చేసుకుంటుందూ రీతూ ఆటని కొనియాడుతున్నారు.

Related News

Naga Babu-Bharani: భరణి రీఎంట్రీ వెనుక మెగా బ్రదర్‌ హస్తం.. అసలు సంగతేంటంటే!

Bigg Boss 9 Promo: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. కళ్యాణ్‌ని పొడిచిన శ్రీజ

Bigg Boss 9 Telugu: శ్రీజ, భరణిల రీఎంట్రీ కన్‌ఫాం.. ఇక రచ్చ రచ్చే!

Bigg Boss 9: పాపం పచ్చళ్ల పాప.. ఎన్ని కలలు కంది.. ఈ ట్రోల్స్ ఎక్కడ చూడలేదు భయ్యా!

Bigg Boss 9 Trolls: ఇదెక్కడి రోస్ట్ మామా.. ఏకంగా పెళ్లి కూడా చేసేసారుగా?

Bigg Boss 9 Promo: తలరాతను మార్చే టైమ్.. హౌస్ లోకి మాజీలు.. ఎవరెవరంటే?

Bigg Boss Buzzz : రీతూ పై రమ్య షాకింగ్ కామెంట్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శివాజీ..

Big Stories

×