E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: శ్రీజ, భరణిల రీఎంట్రీ కన్‌ఫాం.. ఇక రచ్చ రచ్చే!

Bigg Boss 9 Telugu: శ్రీజ, భరణిల రీఎంట్రీ కన్‌ఫాం.. ఇక రచ్చ రచ్చే!
Advertisement

Bigg Boss 9 Telugu Re-entry: ఈ సారి చదరంగం కాదు రణరంగమే అంటూ బిగ్ బాస్‌ 9 కొత్త సీజన్‌ని లాంచ్‌ చేశారు. ట్యాగ్‌ తగ్గట్టే హౌజ్‌ కంటెస్టెంట్స్‌ వార్‌ చూస్తుంటే హౌజంత రణరంగమే అన్నట్టు మారిపోతుంది. ఎప్పుడు ఎవరు ఎవరికి టార్గెట్‌ అవుతున్నారు. ఎవరు ఎప్పుడు గొడవ పడుతున్నారో ఊహందని విధంగా ఉంది. మంచి స్నేహితులుగా ఉన్నవాళ్ల మధ్య కూడా బిగ్‌ బాస్ చిచ్చు పెడుతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే హౌజ్‌లో వైల్డ్‌ కార్డ్స్‌ పేరుతో ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్‌ని దింపారు. అప్పటి నుంచి షో మరింత రసవత్తరంగా మారింది. దువ్వాడ మాధురికి మరో బిగ్‌ బాస్‌ అందరిని శాసిస్తుండటం.. కదిపితే కయ్యానికి పోతుంది.

బిగ్‌ బాస్‌ భారీ స్కేచ్

Advertisement

ఇలా గొడవలు, ఎమోషన్స్‌, బాండింగ్స్‌ ఆసక్తిగా సాగుతున్న ఆటని మరింత రక్తి కట్టించేందుకు బాగ్‌ బాస్‌ మరో స్కేచ్‌ వేశాడు. హౌజ్‌లో మరింత హీట్‌ పెంచేందుకు ఎలిమినేటెడ్‌ కంటెస్టెంట్స్‌ని హౌజ్‌ లోకి దింపుతున్నారు. ఈ రోజు ఇద్దరు ఎలిమిలినేటేడ్ కంటెస్టెంట్స్‌ తిరిగి హౌజ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారట. వీకెండ్‌ ఎపిసోడ్‌ తర్వాత అత్యంత ఆసక్తిని పెంచేది మండే ఎపిసోడ్‌. ఈ ప్రక్రియలో ఒకరిపై ఒకరు నామినేట్‌ చేస్తుకుంటు వారిపై ఉన్న అక్కసు తీర్చుకుంటారు. ఈ రోజు సోమవారం. అంటే నామినేషన్స్‌ ప్రక్రియ ఉండబోతుంది. ఇందులో కోసం గత సీజన్‌లో జరిగిన నామినేషన్‌ ప్రక్రియనే ఈ సీజన్‌లో రిపీట్‌ చేయబోతున్నారు. అయితే ఈ సారి కొత్తగా ప్లాన్‌ చేశారు.

మాధురి వర్సెస్‌ శ్రీజ

ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌కి రెండు కత్తులు ఇచ్చి నామినేషన్‌లోకి దింపారు. ఒకరు హౌజ్‌లో తమకు నచ్చినవాళ్లకు కత్తి ఇచ్చిన నామినేట్‌ చేయించాలి. మరొక కత్తితో నేరుగా వారే ఒకరిని నామినేట్‌ చేయాలి. అలా ఈసారి హౌజ్‌లో ఇప్పటి వరకు ఎలిమినేట్‌ శ్రేష్టి వర్మ, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్‌, ప్రియ, శ్రీజ దమ్ము, భరణి, ప్రియలు హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే నామినేషన్‌ ప్రక్రియలో శ్రీజ.. మాధురిని నామినేట్‌ చేసింది. ఈ క్రమంలో వీరిద్దర మధ్య ఫుల్‌ హీట్‌ వార్‌ సాగిందట. శ్రీజ మాటలకు, ప్రశ్నలు ఒక్కసారి మాధురి నోట మాట కూడా రాలేదట. తన మాటలు, ప్రశ్నలతో శ్రీజ మాధురికి చుక్కలు చూపించింది.

Advertisement

వీరిద్దరి రీఎంట్రీ కన్‌ఫాం

ఇక ప్రియ.. సంజనని, మనీష్‌.. కళ్యాణ్‌లోని నామినేట్‌ చేశారు. ప్రక్రియ అంత ముగిసిన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్‌ కంటెస్టెంట్స్‌ని అందరిని బయటకు పంపినట్టే పంపారు. ఆ తర్వాత కాసేపటి ఇద్దరిని మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వారే శ్రీజ దమ్ము, భరణి. వీరిద్దరి రాకతో ఇప్పుడు హౌజ్‌లో మళ్లీ ఫుల్‌ అయ్యింది. రమ్య, ఆయేషా ఎలిమినేట్‌తో 10 మంది ఉన్న హౌజ్‌లోకి శ్రీజ, భరణి రాకతో 12 మంది అయ్యారు. శ్రీజ రాకతో హౌజ్‌లో మళ్లీ రచ్చ రచ్చ అవ్వడం ఖాయం. ఓ వైపు కళ్యాణ్‌, తనూజ మరో వైపు మాధురిలతో శ్రీజ ఆట ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. బంధాల కారణంగా ఎలిమినేట్‌ అయిన భరణి.. ఇక రీఎంట్రీతో తన సత్తా చూపిస్తాడేమో చూడాలి.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×