Bharani Re Entry to Bigg Boss House: ‘కుటుంబం అన్నగారి కుటుంబం‘ ఈ పాట వింటే ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ పెద్దన్నయ్య మూవీ గుర్తు వచ్చేది. కానీ ఇప్పుడు బిగ్ బాస్ భరణి గుర్తొస్తున్నారు. ఈ సీజన్లో కంటెస్టెంట్గా వచ్చిన ఆయన ఆట ఏ రేంజ్లో ఉంటుందో అని ఆడియన్స్ అంత ఆసక్తి చూపించారు. సినిమాల్లో విలన్ రోల్స్ తో గుర్తింపు పొందిన భరణి.. బిగ్ బాస్ షోలో ఆయన ఆటలోనూ ఎంతటి వైయిలెన్స్ చూపిస్తారని అంచనాల్లో వేసుకున్నారు. హైపర్ ఆది అన్నట్టుగా అరుంధతిలో పశుపతి ఇమేజ్తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మంగపతిలా ఆర్డర్ వేస్తూ హౌజ్లో ఎలివేషన్ ఇచ్చిన భరణి ఆట అలా పైకి వెళుతుందని అనుకున్నారు.
సీరియల్లో విలనిజంతో హీరోలకు చుక్కలు చూపించినట్టే.. ఇక హౌజ్ లో కంటెస్టెంట్స్కి కూడా ఇక చుక్కలే అనుకున్నారు. కానీ, ఆటలలో విలన్లా రెచ్చిపోతారనుకుంటే సాఫ్ట్ యాంగిల్ బంధాలు పెంచుకుంటు వెళ్లారు. రణరంగమంటూ ఈ సీజన్ ప్లాన్ చేస్తే.. కుటుంబం సీరియల్లా మార్చేశారు. ఆఖరికి హౌజ్లో వాళ్లే ఆయన్ను చూసి కుటుంబం అన్నగారి కుటుంబం అని పాడుకునేలా చేశాడు. తనూజ, దివ్య, సంజనలతో బంధాలు పెట్టేసుకుని గేమ్ ఆడటం మర్చిపోయిన భరణి గత వారం ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి టాప్లో ఉండాల్సిన భరణి.. అలా బయటకు వచ్చేయడానికి కారణం ఆయన ఆటే. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ కి బంధాల కోసం రాలేదని, ఇకనైన గేమ్పై ఫోకస్ పెట్టమని ఎన్నిసార్లు హెచ్చరించిన తీరు మార్చుకోలేదు.
బంధాల్లోనే ఇరుక్కుపోయి ఆట ఆడటమే మర్చిపోయాడు. ఇది హౌజ్లోనూ బయట పెద్ద చర్చ అయ్యింది. ఆ బంధాలు పక్కన పెడితే భరణి మంచి గేమ్ ప్లేయర్ అవుతాడని చర్చించుకుంటుండగానే.. ఆరో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌లో ఇద్దరికి రీఎంట్రీ ఉన్న సంగతి తెలిసిందే. అందులో భరణి కూడా ఉన్నారు. ఇది తెలిసి అంత సర్ప్రైజ్ అవుతున్నారు. నిజానికి ఎలిమినేట్ అయిన వారిలో భరణి కంటే బాగా ఆడిన వారు ఉన్నారు. కానీ, వాళ్లను కాదని భరణిని మళ్లీ తీసుకువస్తే మంచి ఆటతో సాగుతున్న ఈ షో మళ్లీ ఫ్యామిలీ షో అవుతుందని సెటైర్స్ వేస్తున్నారు. అయితే భరణి రీఎంట్రీ వెనకు మెగా బ్రదర్ ప్లాన్ ఉందని తెలుస్తోంది.
నాగబాబు వల్లే భరణి మళ్లీ హౌజ్లోకి వస్తున్నాడంటూ యాంటి ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. మొదటి నుంచి నాగబాబు భరణికి సపోర్టు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బిగ్‌బాస్ హౌజ్‌తో ఎంట్రీ ఇవ్వగానే.. భరణిని విష్ చేస్తూ నాగబాబు ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ రీఎంట్రీ అనగానే నాగబాబు రంగంలోకి దిగి.. మళ్లీ అతడిని లోపలికి వచ్చేలా చేశాడని అంటున్నారు యాంటి ఫ్యాన్స్. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. కానీ, భరణి రీఎంట్రీతో అయినా తన గేమ్పై ఫోకస్ పెట్టి కప్ గెలవాలని అంటున్నారు. ఇప్పుడు కూడా రిలేషన్స్ అంటూ పోతే.. ఆయన రీఎంట్రీకి అర్థం లేదని.. ఈ సారి సపోర్టర్స్ కూడా భరణిని హేట్ చేయడం పక్కా. మరి ఈసారి ఈ పెద్దన్న ఆట ఎలా ఉంటుందో చూడాలి.