BigTV English
Advertisement

Bigg Boss 9 Telugu : పచ్చళ్ళ పాప బిగ్ బాస్ లోకి రాలేదు.. ఏం జరిగిందబ్బా..?

Bigg Boss 9 Telugu : పచ్చళ్ళ పాప బిగ్ బాస్ లోకి రాలేదు.. ఏం జరిగిందబ్బా..?

Bigg Boss 9 Telugu : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాల్టీ షో అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు బిగ్ బాస్.. తెలుగులో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది.. 9వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళకు వాళ్ళ కల నెరవేరి పోయింది. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్ గా ప్రారంభమైంది. సెలబ్రిటీలు సామాన్యులతో హౌస్ మొత్తం కళకళలాడిపోతుంది. వీళ్ల కన్నా ముందుగా హౌస్ గురించి మాట్లాడుకోవాలి.. గత ఎనిమిది సీజన్లో లేని విధంగా ఈసారి హౌస్ ని డిజైన్ చేశారు. డబుల్ డోస్.. డబుల్ డోస్ అని ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ఉంది. 14 మందిని హౌస్ లోకి పంపారు. అయితే గత కొన్ని రోజులుగా అలేఖ్య చిట్టి పీకిల్స్ అలేఖ్య బిగ్ బాస్ లోకి రాబోతుందంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆమె ఎంట్రీ ఇవ్వలేదు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.. అసలేం జరిగింది ఎందుకు ఈ పాప హౌస్ లోకి రాలేదు ఒకసారి తెలుసుకుందాం…


పచ్చళ్ళ పాప ఎందుకు రాలేదు..? 

తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్లతో బాగా ఫేమస్ అయిన ముద్దుగుమ్మ రమ్య చిట్టి పీకెల్స్.. కంచర్ల రమ్య మోక్ష అనే అమ్మాయి తన సోదరీమణులు కంచర్ల సుమ, కంచర్ల అలేఖ్యతో పికిల్స్ వ్యాపారం చేస్తోంది.. కొద్దిరోజుల వరకు వీరి మీద విపరీతమైన నెగిటివిటీ ప్రచారం కావడంతో పచ్చళ్ల వ్యాపారాన్ని నిలుపుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ వ్యాపారం మొదలుపెట్టారు.. సోషల్ మీడియాలో ఈమెకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఈమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.. కొద్ది రోజుల క్రితం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిందంటూ వార్తలు వినిపించాయి.. కానీ ఇప్పుడు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి రాబోతున్న అంటూ నిన్నటి వరకు వార్తలు వినిపించాయి కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఎంట్రీ మాత్రం లేదు. మరి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి..

బిగ్ బాస్ 9 లోకి 14 మంది.. 

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్.. 8 సీసన్లను పూర్తి చేసుకున్న ఈ షో 9 వ సీజన్ కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది.. హౌస్ లోకి సెలబ్రిటీలు సామాన్యులు కలిసి 14 ఎంట్రీ ఇచ్చేశారు. అందులో సినీనశ్రేణించి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండడంతో ఈసారి రచ్చ మాములుగా ఉండదు నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.. ఏది ఏమైనా కూడా నిన్న గ్రాండ్ గా బిగ్ బాస్ షో మొదలైపోయింది. డబల్ డోస్ డబల్ హౌస్ అంటూ నాగార్జున అన్న మాటలు హైలెట్గా నిలిచాయి.. ప్రస్తుతానికి అయితే అందరూ ఒకే చోట ఉన్న కూడా ముందు ముందు రెండు టీమ్ లుగా విడగొట్టి రెండు హౌస్లలోకి పంపిస్తారు చూడాలి.. ఏది ఏమైనా కూడా ఇవాల్టి నుంచి బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఎంతో క్యూరియాసిటీతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు.


Related News

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ గుట్టు రట్టు చేసిన నాగ్.. షాక్ లో తనూజ

Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్

Bigg Boss 9: రాము విషయంలో తనూజకు ఫుల్ క్లాస్, వీడియోలతో కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న నాగ్

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Duvvada Madhuri: ఒక్క వారంలో ఊహించని మార్పు, అంత తనూజ దయ

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 యాజమాన్యంలో ఎంత మార్పు వచ్చిందో, దెబ్బకు అలా చేయడం ఆపేశారు

Bigg Boss 9 Promo: నువ్వు తోపు అయితే.. అది ఇక్కడ కాదు, మాధురికి నాగ్‌ వార్నింగ్

Ramya Moksha: తనూజ వల్లే రమ్య అవుట్.. పిక్కిల్స్‌ పాప ఎలిమినేషన్‌ కి కారణాలివే!

Big Stories

×