OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్, ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకుల చేత కేరింతలు పెట్టిస్తోంది. ఈ సిరీస్ ట్రాన్స్‌జెండర్ పాత్రను సున్నితంగా చిత్రీకరించినందుకు విమర్శకులు నుండి ప్రశంసలు అందుకుంది. ఇందులో క్లైమాక్స్ నెవెర్ బిఫోర్ అన్నట్టు ఉంటుంది. పెళ్ళి కూతురు మొదటి రాత్రి భర్తకు ఇచ్చే ట్విస్ట్ మరో లెవెల్ లో ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
రొమాంచక్ అరోరా ముంబైలో ఒక చిన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మామూలు జీవితం గడుపుతుంటాడు. తన బోరింగ్ జీవితాన్ని “రొమాంచక్” చేయాలని కోరుకుంటాడు. ఒక రోజు అతని ఆఫీస్‌కి శివానీ భట్నాగర్ వస్తుంది. ఆమె అందానికి రొమాంచక్ పడిపోతాడు. శివానీ ఒక బ్యాచిలర్ అమ్మాయి కావడంతో, ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోకపోవడంతో నిరాశతో ఉంటుంది. రొమాంచక్ స్నేహితుడు జీతు సలహాతో, రొమాంచక్ తన ఇంట్లో ఒక గదిని శివానీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అంతేకాకుండా త్వరలోనే శివానీ అతని కుటుంబంతో స్నేహం చేస్తుంది. ఆతరువాత వారి స్నేహం ప్రేమగా మారుతుంది.
రొమాంచక్ తల్లి ప్రమేయంతో వారి పెళ్లి కూడా ఖాయమవుతుంది. అనుకున్నట్టే పెళ్ళి కూడా జరిగిపోతుంది. అయితే పెళ్లి రోజు రాత్రి, శివానీ ఒక షాకింగ్ సీక్రెట్ బయటపెడుతుంది. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ. ఈ విషయం తెలిసిన రొమాంచక్ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్తాడు. సమాజంలో, ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏమవుతుందోనని రొమాంచక్ గందరగోళంలో పడతాడు. మొదటి రాత్రి ఆశలు ఆవిరైపోతాయి. ఇక ఈ సిరీస్ మిగిలిన భాగం రొమాంచక్ ఈ నిజాన్ని ఎలా ఒప్పుకుంటాడు ? శివానీ ఎలాంటి సమస్యలతో పోరాడుతుంది ? వీళ్ళిద్దరూ కలసి బతుకుతారా ? విడిపోతారా ? ఈ స్టోరీ ఎలాంటి ముగింపు ఇస్తుంది ? అనే ప్రశ్నలకు సామాధానాలను ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
‘పతి పత్నీ ఔర్ పంగా’ (Pati Patni Aur Panga) అనేది అబీర్ సేన్‌గుప్తా దర్శకత్వంలో వచ్చిన హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్. ఇందులో ఆదాహ్ శర్మ, నవీన్ కస్తూరియా, హితేన్ తేజ్వానీ, గుర్‌ప్రీత్ సైనీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఆరు ఎపిసోడ్‌ల సిరీస్ MX ప్లేయర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది.
Read Also : ఫస్ట్ నైట్ నాడు ఏం చేయాలో తెలియని ఆణిముత్యం… ఫ్రెండ్ మాట విని భార్యపై అఘాయిత్యం… ఫీల్ గుడ్ మలయాళ డ్రామా