E-Paper
Advertisement

సెప్టెంబర్ 28 నుంచి సమ్మె.. అలర్టయిన ఎస్బీఐ, కస్టమర్లకు ముఖ్య గమనిక

సెప్టెంబర్ 28 నుంచి సమ్మె.. అలర్టయిన ఎస్బీఐ, కస్టమర్లకు ముఖ్య గమనిక
Advertisement

Bank Strike: దేశవ్యాప్తంగా మూడు రోజులు బ్యాంకులు సంఘాలు సమ్మెకు దిగనుండడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఒక సలహా జారీ చేసింది. సమ్మె కాలంలో సంభవించే అంతరాయాలను నివారించడానికి బ్యాంకింగ్ లావాదేవీలను ముందుగా పూర్తి చేసుకోవాలని వినియోగదారులను కోరింది ఎస్‌బీఐ.

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకుల సమ్మె

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చేవారం నుంచి సోమ, మంగళ, బుధవారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అంతకు రెండు రోజులు అనగా 26, 27న శని-ఆదివారాలు రావడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో బ్యాంకు లావాదేవీలు ఉన్నవారు సమ్మె కంటే ముందు పూర్తి చేసుకోవాలని సూచన చేసింది.

ఈనెల 26 నుంచి మూతపడనున్న బ్యాంకులు

Advertisement

ఇప్పటికే సెప్టెంబర్ 11న ఓ రోజు సమ్మె చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల చివర మరోసారి సమ్మెకు రెడీ అయ్యింది. అప్పటికీ కేంద్రం దిగిరాకుండా ఉంటే.. అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని ఆలోచన చేస్తోంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తు సలహాలు జారీ చేసింది. సమ్మె సమయంలో బ్యాంక్ బ్రాంచ్‌ సిబ్బంది సహాయం అవసరమయ్యే పనులు, డాక్యుమెంట్ల పరిశీలన, కొన్నిరకాల చెక్కుల ప్రాసెసింగ్ వంటి సేవలకు ఆటంకం కలగవచ్చని స్పష్టంచేసింది. సమ్మెలో ఎంతమంది ఉద్యోగులు పాల్గొంటారనే దానిపై ఆయా బ్రాంచ్‌ పని తీరు మీద ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

ALSO READ: ఆన్‌లైన్‌లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? జాగ్రత్త ఈ విషయాలు తెలుసుకోండి

Advertisement

వినియోగదారులు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని కోరింది. నగదు అవసరాల కోసం ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్‌లు, కస్టమర్ సర్వీస్ పాయింట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వీటితోపాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ వంటి డిజిటల్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని తెలియజేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆటంకం లేకుండా చేసుకోవచ్చని వివరించింది. బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనులను ముందుగా ప్లాన్ చేసుకోవాలని ఖాతాదారులకు సూచించింది.

Related News

ఆన్‌లైన్‌లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా? జాగ్రత్త ఈ విషయాలు తెలుసుకోండి

బ్యాంక్‌లో పర్సనల్ లోన్ కావాలా? తక్కువ వడ్డీకి ఏ బ్యాంక్ ఇస్తోందో వివరాలివిగో

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి, అక్టోబరు 1 నుంచి అమలు

బాంబు పేల్చిన పెట్రోల్ బంక్ డీలర్లు.. యూపీఐ చెల్లింపులు నిలిపివేత.. ఆ తేదీ నుంచి క్యాష్ తప్పనిసరి!

ప్రతి ఐఫోన్ విక్రయంతో శామ్‌సంగ్‌కు రూ.24,000 లాభం.. ఎలాగంటే?

ఐస్ క్రీమ్ రంగంలోకి రిలయన్స్.. అమూల్ పని అయిపోయినట్లేనా? అంబానీ అసలు వ్యూహం ఏంటి?

వొడాఫోన్ సూపర్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. ఎంత డేటా వినియోగించినా ఎక్స్‌ట్రా ఖర్చు అసలు ఉండదు

Big Stories

Advertisement
×