Big Alert to LPG Gas Cylinders: అంతర్జాతీయ పరిణామాలు క్రమంలో భారత్‌పై చూపుతున్నాయి. ఫలితంగా కొత్త కొత్త రూల్స్ తెరపైకి తెస్తో్ంది కేంద్రం. తాజాగా దేశవ్యాప్తంగా గృహ ఎల్‌పిజి వినియోగదారుల కోసం కొత్త ఆదేశాలు జారీ చేసింది. రాయితీపై ఇచ్చే వంటగ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. అక్టోబరు 1 నుంచి ఈ-కేవైసీ చేసినవారికి రాయితీపై వంటగ్యాస్ సిలిండర్ అందనుంది. దీంతో వినియోగదారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.
నకిలీ కనెక్షన్లను అరికట్టడానికి, సబ్సిడీ ప్రయోజనాలు సామాన్య కుటుంబాలకు మాత్రమే చేరేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీపై వంటగ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. కొత్త నిబంధన అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈ-కేవైసీ చేసినవారికి రాయితీపై వంట గ్యాస్ సిలిండర్ అందనుంది. లేకుంటే రాయితీపై గ్యాస్ సిలిండర్ రావడం కష్టం.
సెప్టెంబర్ 19 నాటికి దేశీయంగా ఎల్‌పిజి వినియోగదారుల ధృవీకరణ 89.9 శాతం పూర్తయింది. వారికి రీఫిల్ బుకింగ్‌లు అంతరాయం లేకుండా కొనసాగుతాయి. వారికి సబ్సిడీ లభిస్తుందని, మిగతావారినకి లభించదని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఈకేవైసీ చేయించుకున్నవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. వారికి రాయితీ సిలిండర్లు అందిస్తారు. ఇంకా పూర్తిచేయని వారు ఈ-కేవైసీ తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు.
ఈ-కేవైసీ చేయించుకునేందుకు వినియోగదారులకు పలుమార్లు సమయం పొడిగించింది. తొలుత గడువు జూన్ 30, 2026 ఇచ్చింది. ఆ తర్వాత జూలై 31, ఆగస్టు 7, ఆగస్టు 15, ఆగస్టు 23, ఆగస్టు 31, సెప్టెంబర్ 7 ఇలా పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. చివరగా సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది కేంద్రం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2026 ఆగస్టు 31 నాటికి, దేశీయ ఎల్‌పిజిపై ప్రభుత్వ రంగ చమురు కంపెనీల బకాయి నష్టాలు రూ. 62,000 కోట్లను దాటాయి.
కేవైసీ కోసం వినియోగదారులు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు. ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సమయంలో బయోమెట్రిక్ ధృవీకరణ చేయవచ్చు. లేకుంటే ప్రత్యామ్నాయంగా వినియోగదారులు తమ గ్యాస్ పంపిణీదారుడి షోరూమ్‌ను సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ సౌకర్యం ప్రభుత్వ రంగ చమురు కంపెనీల మొబైల్ యాప్‌ల ద్వారా అందుబాటులో ఉంది. ఇండేన్ వినియోగదారులు ఇండియన్ ఆయిల్ వన్ ద్వారా, భారత్ గ్యాస్ వినియోగదారులు హలో బీపీసీఎల్ ద్వారా, హెచ్‌పి గ్యాస్ వినియోగదారులు హెచ్‌పి పే యాప్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ALSO READ: బాంబు పేల్చిన పెట్రోల్ బంక్ డీలర్లు.. యూపీఐ చెల్లింపులు నిలిపివేత.. ఆ తేదీ నుంచి క్యాష్ తప్పనిసరి!
ఈ-కెవైసి కోసం 2 ఎంపికలు ఉన్నాయి. మొబైల్ యాప్ ద్వారా ప్రక్రియను పూర్తి చేయడంలో సమస్యలను ఎదుర్కుంటుంటే ఇతర ఎంపిక ఉంది. సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సందర్శించి బయోమెట్రిక్ పూర్తి చేయించుకోవచ్చు. సిలిండర్ డెలివరీ వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు అతని వద్ద అందుబాటులో ఉన్న అధికారిక పరికరం ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ చేయవచ్చు.
ధృవీకరణ విఫలమైతే వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు. యాప్‌ను తెరిచి ధృవీకరణ ప్రక్రియ కోసం మళ్లీ ప్రయత్నించండి. మీ ముఖంపై మంచి వెలుతురు ఉండేలా మీ మొబైల్ ఫోన్ స్థిరంగా ఉంచాలి. ఫేస్ స్కాన్ తర్వాత యాప్‌లో e-KYC సక్సెస్ స్టేటస్‌ను తప్పకుండా తనిఖీ చేయండి. ఫేస్ స్కాన్ పూర్తయినంత మాత్రాన ఈ-కేవైసీ పూర్తయినట్లు కాదు. స్టేటస్ సక్సెస్ అని చూపించకపోతే వినియోగదారు రికార్డులలోని ఇ-కెవైసి స్టేటస్‌ను గ్యాస్ ఏజెన్సీతో ధృవీకరించుకోవాలి.