Sobhita dhulipala: అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ్ల (Sobhita dhulipala) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఇప్పుడు నటనతో రణరంగంలో విజృంభిస్తున్న తీరు చూస్తుంటే.. అక్కినేని కోడలు నటన రంగంలో ఎక్కడో ఉండాల్సింది కదా అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హోదా దక్కించుకున్నప్పటికీ ఆమె నటన సామర్థ్యాన్ని చూసి మహా మహానుభావులే ఆశ్చర్యపోతున్నారనడంలో సందేహం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. రణరంగంలో ఆమె విజృంభిస్తున్న తీరుకు సంబంధించిన వీడియోని చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ప్రతి ఒక్కరూ శోభితాలో ఇంత టాలెంట్, కసి, పట్టుదల ఉందా అంటూ నివ్వెర పోతున్నారు.
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం వేట్టువం. ఆర్య, వి.ఆర్. దినేష్ లతోపాటు శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 2026న పాన్ ఇండియా థియేటర్ లో విడుదలకు ఈ సినిమా షెడ్యూల్ చేయబడింది. నీలం ప్రొడక్షన్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్, గోల్డెన్ రేషియో ఫిలిమ్స్ బ్యానర్లపై ఎస్ . సాయి దేవానంద్, ఎస్ సాయి వెంకటేశ్వరన్, పా. రంజిత్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ్ , తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలో ఓకే సారీ రిలీజ్ చేయబోతున్నారు.
ఇకపోతే సినిమా షూటింగ్లో తన పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ పాత్ర కోసం ఆమె పడ్డ కష్టాన్ని ఒక వీడియో రూపంలో అన్నపూర్ణ స్టూడియోస్ పంచుకున్నారు. శోభిత ఇందులో రాతి అనే పాత్రలో నటిస్తోంది. నిర్భయమైన, ధైర్యవంతురాలైన పాత్రగా వర్ణించారు. కేవలం ఎమోషనల్ రోల్స్ కే పరిమితం కాకుండా కథనాన్ని వేగంగా ముందుకు నడిపిస్తూ.. పోరాట సన్నివేశాలను సునాయాసంగా పోషించగల పాత్రను ఆమె ఎంచుకున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన వీడియోలో ఉత్కంఠ భరితమైన యాక్షన్ సన్నివేశాలు, స్టంట్స్.. పైగా బాడీ డబుల్ సహాయం లేకుండా ప్రదర్శించింది.
also read: ఫాంటమ్ ఆఫ్ ది ప్యారడైజ్’ మూవీ నటుడు మృతి.. అసలు ఏం జరిగిందంటే?
ఇకపోతే శోభిత తన పాత్ర కోసం ప్రత్యేకంగా ఆది మురై, సురుల్, మల్ల కంబ పోల్ వంటి సాంప్రదాయ యుద్ధ కళను నేర్చుకుంది. విస్తృతమైన శారీరక శిక్షణ కూడా పొందింది. గతం, వర్తమానం, భవిష్యత్తులకు ప్రాధాన్యత వహించే మూడు విభిన్నమైన యుగాల నేపథ్యంలో రాబోతున్న ఈ కథ పర్యావరణ విధ్వంసం, వంశ యుద్ధాలు , అధికార పోరాటాల మనుగడ వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. ఇక కొరియోగ్రఫీలో సాంప్రదాయ దక్షిణ భారత యుద్ధ కళలో శిక్షణ, ప్రాచీన పోరాట పద్ధతులను సినిమాలో ప్రత్యేకంగా చూపించబోతున్నారు. ఏది ఏమైనా బయటకు చాలా సౌమ్యంగా కనిపించే శోభితాలో ఇంత పట్టుదలా అంటూ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు, ఆఖరికి పలువురు సెలబ్రిటీలు కూడా ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి విడుదల చేసిన వరల్డ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ వీడియో కి స్టార్ హీరో రానా వాయిస్ అందించారు.
?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==