iphone Sales Samsung Revenue| దిగ్గజ కంపెనీ ఆపిల్ తాజాగా ఐఫోన్ 18 ప్రో సిరీస్ ఫోన్లు లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్లకు విపరీత ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగానే ఆపిల్ కంపెనీ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్ కూడా విడుదల చేసింది. ఐఫోన్ డుయో పేరుతో వచ్చిన ఫోన్ ఇంకా అధికారికంగా మార్కెట్లోకి తీసుకురాలేదు. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు తాజాగా ఓ రిపోర్ట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ తయారీలో ప్రముఖ దక్షిణ కొరియా కంపెనీ శామ్‌సంగ్ కూడా పాలుపంచుకుంటోంది. అందుకే ప్రతీ ఐఫోన్ డుయో విక్రయం వల్ల శాంసంగ్ కంపెనీకి భారీ లాభం చేకూరుతుంది. అయితే ఈ ధర, డీల్ గురించి ఆపిల్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ సమాచారం చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో వచ్చిన ఓ పోస్టు ద్వారా వెలుగులోకి వచ్చింది. Momentary Digital అనే అకౌంట్ ఈ వివరాలను వెల్లడించినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.
శామ్‌సంగ్ డిస్‌ప్లేకు ఆపిల్‌తో మూడేళ్ల ప్రత్యేక సరఫరా ఒప్పందం కుదిరిందని ఆ పోస్టు పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఫోల్డబుల్ ఐఫోన్‌కు అవసరమైన ఫోల్డింగ్ డిస్‌ప్లేలను కవర్ చేయవచ్చని సమాచారం. భవిష్యత్తులో విడుదలయ్యే మరికొన్ని ఫోల్డబుల్ ఐఫోన్ మోడల్స్‌కు కూడా ఇది వర్తించవచ్చని తెలుస్తోంది.
సాధారణ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌తో పోలిస్తే ఫోల్డబుల్ స్క్రీన్ తయారీ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఫోన్‌ను ఎన్నిసార్లు మడిచినా స్క్రీన్ దెబ్బతినకుండా ఉండాలి. అదే సమయంలో బ్రైట్‌నెస్, కలర్స్, టచ్ రెస్పాన్స్, పిక్చర్ క్వాలిటీ కూడా స్థిరంగా ఉండాలి. అందుకే ఫోల్డింగ్ OLED స్క్రీన్‌ల తయారీకి ప్రత్యేక టెక్నాలజీ అవసరం. ఆపిల్ ఫోన్‌లో శామ్‌సంగ్ కొత్త M16 OLED మెటీరియల్ ఉపయోగించవచ్చని కూడా రిపోర్టులు చెబుతున్నాయి. స్క్రీన్ రక్షణ కోసం బలమైన గ్లాస్ లేయర్లను ఉపయోగించే అవకాశం కూడా ఉంది.
రిపోర్టుల్లో పేర్కొన్న 250 అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.24,000 మొత్తం లోపలి ఫోల్డింగ్ స్క్రీన్.. సరఫరా ధరగా మాత్రమే భావించాలి. ఇందులో ఫోన్ బయటి స్క్రీన్ ధర ఉండదు.
స్క్రీన్‌ను ఫోన్‌లో అమర్చే ఖర్చులు కూడా ఇందులో ఉండవు. టెస్టింగ్, ఇతర హార్డ్‌వేర్ వంటి ఖర్చులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణ OLED స్క్రీన్‌ల ధరతో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రీమియం ఐఫోన్‌లోని సాధారణ OLED డిస్‌ప్లే ధర సుమారు 70 డాలర్లుగా రిపోర్టులు పేర్కొన్నాయి.
Also Read: ఫోన్ చోరీ అయిందా? మీ బ్యాంక్ ఖాతాను కాపాడేందుకు వెంటనే ఈ 5 పనులు చేయండి
ఫోల్డింగ్ OLED స్క్రీన్‌ల తయారీలో శామ్‌సంగ్ డిస్‌ప్లేకు ఇప్పటికే మంచి అనుభవం ఉంది. శామ్‌సంగ్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఇలాంటి స్క్రీన్‌లను చాలాకాలంగా తయారు చేస్తోంది.
అందువల్ల ఆపిల్‌కు శామ్‌సంగ్ ఒక ముఖ్యమైన డిస్‌ప్లే సప్లయర్‌గా మారవచ్చు. LG డిస్‌ప్లేకు ప్రస్తుతం ఇలాంటి ఉత్పత్తి సామర్థ్యం పరిమితంగా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.
చైనాకు చెందిన BOE కూడా ఫోల్డబుల్ డిస్‌ప్లేలను తయారు చేస్తోంది. అయితే ఆపిల్ చివరకు ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంటుందో అధికారికంగా తెలియాల్సి ఉంది.
Also Read: యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం
ఆపిల్, శామ్‌సంగ్ కంపెనీలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. అయితే ఫోల్డబుల్ ఐఫోన్ విషయంలో ఆపిల్ కంపెనీ శామ్‌సంగ్ టెక్నాలజీపై ఆధారపడే పరిస్థితి రావచ్చు. మూడేళ్ల ఒప్పందం నిజమైతే శామ్‌సంగ్ డిస్‌ప్లేకు దీర్ఘకాలిక వ్యాపారం లభించే అవకాశం ఉంటుంది. అయితే ఆపిల్ లేదా శామ్‌సంగ్ అధికారికంగా ప్రకటించే వరకు ఈ వివరాలను రిపోర్టులుగానే చూడాలి.
Also Read: ఐఫోన్ 18 ప్రో తక్కువ ధరలో కావాలా? ఈ దేశాల్లో కొంటే ఇండియా కంటే చీప్