TV vs Projector: ప్రతిసారీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ఇంట్లోనే పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, స్పోర్ట్స్ చూసేందుకు చాలామంది మంచి టీవీని కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ కావాలనే ఉద్దేశంతో ప్రొజెక్టర్ వైపు చూస్తున్నారు. అయితే టీవీనా, ప్రొజెక్టరా అనే నిర్ణయం తీసుకునేటప్పుడు కనిపించే ధరను మాత్రమే చూసి ఫిక్స్ అవ్వడం సరైనది కాదు.
ఎందుకంటే కొనుగోలు చేసిన తర్వాత కూడా ఖర్చులు కొనసాగుతాయి. కరెంట్ బిల్లు, సౌండ్ సిస్టమ్, ప్రొజెక్టర్ కోసం స్క్రీన్ లేదా మౌంటింగ్ వంటి అదనపు సామగ్రి.. ఇక ల్యాంప్ ఉన్న ప్రొజెక్టర్లకు కొంతకాలానికి ల్యాంప్ మార్చాల్సిన ఖర్చు కూడా రావచ్చు. వీటన్నింటినీ కలిపి లెక్కిస్తే మొదట అనుకున్న బడ్జెట్ కంటే మొత్తం ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. మరి టీవీ, ప్రొజెక్టర్‌లో ఏది కొనుకుంటే మీ అవసరాలకు సరిపోతుంది? ప్రారంభ ధరతో పాటు కరెంట్, అదనపు పరికరాలు, నిర్వహణ ఖర్చులను కూడా కలిపి చూస్తే అసలు లెక్క ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీవీలు, ప్రొజెక్టర్లు రెండూ కొన్ని వేల రూపాయల నుంచి మొదలై.. ప్రీమియం మోడళ్లలో లక్షల వరకు వెళ్లొచ్చు. స్క్రీన్ పరిమాణం, పిక్చర్ క్వాలిటీ, ఫీచర్లను బట్టి ధర మారుతుంది. కాబట్టి.. ప్రారంభ ధర ఒక్కటే చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు.
Also Read: Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!
ప్రొజెక్టర్ కొంటే స్క్రీన్, మౌంటింగ్ పరికరాలు, మంచి సౌండ్ సిస్టమ్ అవసరం కావచ్చు. గదిలో వెలుతురు ఎక్కువగా ఉంటే బ్లాక్‌అవుట్ కర్టెన్లు కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ కలిపితే మొదట ఊహించిన బడ్జెట్ కంటే ఖర్చు పెరగొచ్చు.
పవర్ వినియోగం మోడల్‌ను బట్టి మారుతుంది. ఉదా: రోజుకు నాలుగు గంటలు వాడితే 100 వాట్ల టీవీ ఏడాదికి దాదాపు రూ.7,300 విద్యుత్ ఖర్చు చేస్తుంది. 70 వాట్ల ప్రొజెక్టర్ అయితే సుమారు రూ.5,100 అవుతుంది. అయితే ఎక్కువ పవర్ తీసుకునే ప్రొజెక్టర్లలో ఈ లెక్క మారుతుంది.
సాధారణ ల్యాంప్ ఉన్న ప్రొజెక్టర్లలో కొంతకాలానికి ల్యాంప్ మార్చాల్సి రావచ్చు. సాధారణంగా ఒకటి నుంచి రెండేళ్ల తర్వాత మార్పు అవసరం కావచ్చు. ల్యాంప్ ధర సుమారు రూ.8,300 నుంచి రూ.33,000 వరకు ఉండొచ్చు. LED, లేజర్ ప్రొజెక్టర్లలో ఈ సమస్య తక్కువగా ఉంటుంది.
సాధారణంగా టీవీకి ప్రత్యేక స్క్రీన్ లేదా ల్యాంప్ వంటి అదనపు భాగాలు అవసరం ఉండవు. మంచి టీవీని వాడే విధానం, మోడల్‌ను బట్టి 5 నుంచి 10 ఏళ్లు ఉపయోగించవచ్చు. ప్రొజెక్టర్ కూడా ఎక్కువకాలం పనిచేయొచ్చు, కానీ దానికి సంబంధించిన అదనపు ఖర్చులు గుర్తుంచుకోవాలి. చివరికి పెద్ద స్క్రీన్ అనుభూతి కావాలంటే ప్రొజెక్టర్ ఉపయోగకరంగా ఉంటుంది. సింపుల్ సెటప్, తక్కువ నిర్వహణ కావాలంటే టీవీ సౌకర్యంగా ఉంటుంది.
Also Read: స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?