Sunaina Badam: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోయిన్ల విషయంలో ఎంతోమంది ఎన్నో రకాల విమర్శలు కురిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా బాడీ షేమింగ్ అంటూ దారుణమైన ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతోమంది సెలబ్రిటీలు బాడీ షేమింగ్ ట్రోల్స్ పై స్పందిస్తూ తమదైన శైలిలోనే కౌంటర్లు ఇచ్చారు తాజాగా మరో టాలీవుడ్ నటి సైతం తన పట్ల వచ్చిన బాడీ షేమింగ్ ట్రోల్స్ పై తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా తను సినిమా అవకాశాలను కోల్పోవడం గురించి కూడా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలనటిగా పలు సినిమాలలో నటించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా కొనసాగుతున్న వారిలో సునయన (Sunaina)ఒకరు. అమ్మోరు, అరుంధతి సినిమాలలో బాలనటిగా మెప్పించిన ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు. తాజాగా సునయన నటించిన హ్యాపీ జర్నీ(Happy Journey) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సునయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో హ్యాపీ జర్నీ సినిమాలో నా సీన్ల విషయంలో చాలా తక్కువ కట్స్ ఉన్నాయని తెలిపారు. ఇదివరకు తాను నటించిన అన్ని సినిమాలలో తన సన్నివేశాలు అన్నిటిని కట్ చేసేవారని తెలిపారు. తాను అమ్మోరు సినిమా చేయడానికి ముందు ఒక పాతిక సినిమాలలో నటించాను అమ్మోరు సినిమాతో తన కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని భావించాను కానీ కట్ చేస్తే ఇంట్లోనే ఉండిపోయానని తెలిపారు. సరైన ప్లానింగ్ లేకపోవడంతో తనుకు కూడా సినిమా అవకాశాలు రాలేదని సునయన తెలిపారు.
ఇలా ఇంటికి పరిమితమైన తనకు ఓ బేబీ సినిమాతో తిరిగి అవకాశాలు వచ్చాయని ఇప్పుడు ఇప్పుడే తాను కెరియర్ పరంగా నిలదొక్కుకుంటున్నానని తెలిపారు. అయితే చాలామంది నన్ను చూసి నా శరీర బరువుపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. బరువు తగ్గాలని, స్క్రీన్ మొత్తం నువ్వే కనిపిస్తున్నావు అంటూ ఎంతోమంది విమర్శలు కురిపించారు. శరీర బరువు పెరగటం వల్ల అవకాశాలు రాలేదని చాలామంది కామెంట్లు చేశారు. కాస్త శరీర బరువు పెరిగితే ఇక అవకాశాలు ఉండవని తెలిపారు. ఇలా అవకాశాలు రాక ఇంటికే పరిమితమైన నాకు తిరిగి హ్యాపీ జర్నీ సినిమాలో అవకాశం వచ్చిందని ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ఈ సందర్భంగా సునయన తెలిపారు.
Also Read: చిరు లీక్స్.. ‘కాకా’లో తన క్యారెక్టర్ రివీల్ చేసిన మెగాస్టార్!