E-Paper
Advertisement

ఎల్ నినో పై ఏపీ ప్రభుత్వం మెగా యాక్షన్ ప్లాన్.. సీఎం వ్యూహం ఫలిస్తుందా..?

ఎల్ నినో పై ఏపీ ప్రభుత్వం మెగా యాక్షన్ ప్లాన్.. సీఎం వ్యూహం ఫలిస్తుందా..?
Advertisement

El Nino: ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు యాక్షన్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఆర్ఎస్కే సిబ్బందితో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎల్ నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం ధరలు తగ్గింపే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు.

పంటల సాగుపై ఫోకస్..

బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో పెట్టాలంటూ అధికారులకు ఆదేశించారు. హైరిస్క్ ఆర్ఎస్కే పరిధిలోని హార్టికల్చర్ పంటలను ఆదుకునేందుకు ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. డిమాండ్ ఆధారిత పంటల సాగుపై ఫోకస్ పెట్టాలన్న సీఎం చంద్రబాబు. ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేలా తాత్కాలిక, మధ్యంతర ప్రణాళికలతో వెళ్లాలన్నారు. ఎల్ నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకున్నాంమని, ముందుగానే సిద్దం చేసుకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.

గోడౌన్లలో బియ్యం..

Advertisement

ఎల్ నినో ప్రభావం కేవలం రైతుల మీదే కాదు.. అన్ని వ్యవస్థలపై పడుతుంది. ఎల్ నినో బారి నుంచి రైతులను కాపాడే ప్రయత్నం చేస్తూనే ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిమాండ్ కు అనుగుణంగా వివిధ పంటలు సాగు చేయాలి. పంటల బీమా చేయించాం పంట నష్టం సంభవిస్తే.. బీమా మొత్తం రైతులకు దక్కేలా చేయాలన్నారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసరాల ధరలను కంట్రోల్ చేయాలని తెలిపారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు ఎంత మేరకు ఉన్నాయో పరిశీలించాలని, బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకు బియ్యం నిల్వలను మార్కెట్టులోకి వదిలేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Also read: నెల్లూరు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ యత్నం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి!

అదుపులో ధరలు..

Advertisement

ప్రస్తుతం ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని, రానున్న కాలంలో ఉల్లికి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రొత్సహించాలన్నారు. ఇక పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో పెట్టేలా ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను త్వరితగతిన అమలు చేయాలన్నారు. కిచెన్ గార్డెన్లను ప్రొత్సహించండి.. స్వయం సహాయక బృందాల ద్వారా కిచెన్ గార్డెన్ల ద్వారా కూరగాయలు పండించేలా చూడాలన్నారు.

వీబీ జీ రామ్ జీ పనులు..

పచ్చదనం ఎంత మాత్రం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని, వీబీ జీ రామ్ జీ పనులను అనుసంధానం చేసుకుంటూ జలధార కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలన్నారు. వ్యాప్తంగా 50.7 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది. ప్రకాశం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అత్యధిక లోటు వర్షపాతం కన్పిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 30.84 లక్షల హెక్టార్లల్లో సాగు చేయాల్సి ఉండగా ఎల్ నినో కారణంగా 79 శాతం భూముల్లో సాగు పనులు మొదలు పెట్టారు. పప్పు ధాన్యాల సాగు మెరుగ్గా ఉన్నా నూనె గింజల సాగు తక్కువగా ఉందన్నారు.

Also read: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్యకు చెక్!

Tags

Related News

వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్.. చెత్త ఆరోపణలు అంటూ ఫైర్!

నెల్లూరు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ యత్నం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి!

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

Big Stories

Advertisement
×