E-Paper
Advertisement

భారతదేశంలో స్కైడైవింగ్… ఎక్కడెక్కడ చేయవచ్చో తెలిస్తే సాహస ప్రియులు ఎగిరి గంతేస్తారు

భారతదేశంలో స్కైడైవింగ్… ఎక్కడెక్కడ చేయవచ్చో తెలిస్తే సాహస ప్రియులు ఎగిరి గంతేస్తారు
Advertisement

Best Skydiving Places in India: ఎత్తు అంటే భయం లేదా ? పైగా గాల్లో తేలడానికి ఇష్టపడతారా ? అయితే మీరు తప్పక చేయాల్సిన అడ్వెంచర్స్ లో స్కై డైవింగ్ అనేది అగ్రస్థానంలో ఉంటుంది. వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి దూకడం, కొన్ని సెకండ్ల పాటు స్వేచ్ఛగా గాల్లో ఎగురుతూ కిందకు పడిపోవడం, ఆ తర్వాత పారాషూట్ సహాయంతో అందమైన ప్రకృతి దృశ్యాలను వీక్షించడం అన్నది వర్ణించలేని అద్భుతమైన అనుభవం అని చెప్పొచ్చు. ఈ ఉత్కంఠభరితమైన, లైఫ్ లో మర్చిపోలేని అడ్వెంచర్ కోసం చాలామంది దుబాయ్ లేదా న్యూజిలాండ్ కు వెళ్లాలని అనుకుంటున్నారు. కానీ ఇండియాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సెక్యూరిటీ, శిక్షణతో స్కైడైవింగ్ ను ఆస్వాదించగల అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కానీ నిజానికి వీటి గురించి చాలామందికి తెలియదు. మరి ఇండియాలో స్కైడైవింగ్ ను ఎంజాయ్ చేసే ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

పుదుచ్చేరి

నీలి సముద్రంపై ఎగరాలని కలలు కంటున్నారా ? అయితే పుదుచ్చేరి మీకు బెస్ట్ ఆప్షన్. ఇక్కడ తీర ప్రాంత దృశ్యాలు స్కై డైవింగ్ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. గాల్లో ఎగురుతూ కిందకు పడుతున్నప్పుడు ఓ వైపు సముద్రపు అలలు హోరు, మరోవైపు అందమైన ఫ్రెంచ్ వాస్తు కళతో అలంకరించబడిన నగరం మీకు స్వాగతం పలకడం నిజంగానే డ్రీమ్ లా ఉంటుంది.

మహారాష్ట్ర – ఆంబి వ్యాలీ

Advertisement

ఆంబి వ్యాలీ ముంబై – పూణే నగరాలకు సమీపంలో ఉంటుంది. ఇది అందంగా ఉండడంతో పాటు అడ్వెంచర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఫస్ట్ టైం స్కై డైవింగ్ చేస్తుంటే ఇది మీకు పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక్కడ సుమారు 10,000 అడుగుల ఎత్తు నుండి టాండమ్ జంప్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆకాశం నుంచి గంభీరమైన ఆంబీ ర్యాలీని, అలాగే దాని కింద ఉన్న అద్భుతమైన జలాలను చూడడం అన్నది జీవితంలో ఒక్కసారి అయినా ఆస్వాదించాల్సిన మధురానుభూతి.

గుజరాత్ – డిసా

గుజరాత్ లో ఉన్న సుందరమైన నగరం డిసా. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే… ఫస్ట్ టైం అధికారిక స్కై డైవింగ్ గమ్యస్థానంగా ప్రసిద్ధి చెందింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ రెగ్యులర్ గా స్కై డైవింగ్ శిబిరాలను నిర్వహిస్తుంది. కొత్త కొత్తగా స్కై డైవింగ్ చేయాలనుకునేవారు ఇక్కడ స్టాటిక్ లైన్ జంప్ ను ట్రై చేయొచ్చు. ఇది ఒక తాడుకు పారాషూట్ కట్టి, విమానం నుంచి మనం కిందకు పడగానే దానంతట అదే ఓపెన్ అవుతుంది. చాలా సేఫ్ కదా.

కర్ణాటక – మైసూర్

Advertisement

భారతదేశంలోని సూపర్ పాపులర్ అడ్వెంచర్ ప్లేస్ లో మైసూర్ కూడా ఒకటి. స్కై డైవింగ్ కి ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ప్లేస్. చాముండి కొండల పాదాల వద్ద ఉన్న ఈ ప్రదేశం దాదాపు 10000 అడుగుల ఎత్తు నుంచి దూకే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక్కడ శిక్షణ ఇవ్వడంతో పాటు స్టాండర్డ్ జంప్ లు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక మైసూర్ లోని పచ్చని ప్రకృతి దృశ్యాన్ని పైనుంచి చూసినప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది.

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×