BigTV English

BSNL New Recharge Plan: జియో, ఎయిర్‌టెల్‌లను దెబ్బతీసేలా BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్.. వారెవ్వా అదిరిపోయింది!

BSNL New Recharge Plan: జియో, ఎయిర్‌టెల్‌లను దెబ్బతీసేలా BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్.. వారెవ్వా అదిరిపోయింది!

BSNL New Recharge Plan: ప్రముఖ టెలీకాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తాజాగా రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇదే అదునుగా భావించిన మరో టెలీకాం సంస్థ BSNL తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరచింది. దీంతో ఇప్పటి వరకు పెద్దగా జాడలేని ఈ కంపెనీ సిమ్ కార్డులు ఇప్పుడు అధికంగా అమ్ముడవుతున్నాయి.


ఇందులో భాగంగానే బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచుతుంది. కాగా భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ BSNL త్వరలో దేశం మొత్తం 4G సేవలను ప్రారంభించబోతోంది. దీనికీ ఓ కారణం ఉంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు జూలై 2024లోనే తమ ప్లాన్‌ల ధరలను పెంచిన నేపథ్యంలోనే BSNL 4జీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇదంతా పక్కన పెడితే BSNL తాజాగా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. తాజాగా 395 రోజుల పాటు పనిచేసే ప్రత్యేక ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, అనేక ఇతర ప్రయోజనాలను పొందుతారు. BSNL తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్‌లో రూ.2,399లతో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది.

ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2 GB హై స్పీడ్ డేటా, ప్రతిరోజూ 100 ఉచిత SMS, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్ పొందుతారు. అంటే ప్రతి నెలా దాదాపు రూ.185 మాత్రమే ఖర్చవుతుందన్న మాట. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ కూడా ఉంది. వీటితో పాటు జింగ్ మ్యూజిక్, BSNL ట్యూన్స్, హార్డీ గేమ్‌లు, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్‌ఆన్ ఆస్ట్రో టేల్ వంటి అనేక ప్రయోజనాలను కూడా పొందుతారు.


Also Read: స్పీడ్ పెంచిన BSNL.. ఇంటికే సిమ్ కార్డ్.. ఈ స్టెప్స్ పాటించండి!

పెరిగిన ఎయిర్‌టెల్ ప్లాన్ ధరలు

ఎయిర్‌టెల్ ఇటీవల తన ప్రముఖ ప్లాన్‌ల ధరలను పెంచింది. ఇలా చేయడం ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే మంచి సేవలను అందించగలుగుతామని కంపెనీ చెబుతోంది. కొన్ని ప్రధాన మార్పుల విషయానికొస్తే.. ఇంతకుముందు రూ.265 ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ, డైలీ 1GB డేటా పొందేవారు. కానీ ఇది ఇప్పుడు రూ.299కి పెరిగింది. అదే సమయంలో రూ.299 ధర ప్లాన్ 28 రోజుల పాటు 1.5 GB రోజువారీ డేటాతో వచ్చేది.

కానీ ఇప్పుడు అది రూ. 349 పెరిగింది. ఇది కాకుండా రూ.359 ప్లాన్ ధరలో 28 రోజుల పాటు 2 GB రోజువారీ డేటాతో ఉండేది. అది ఇప్పుడు రూ.409 కి చేరింది. అదే సమయంలో 84 రోజుల పాటు 1.5 GB రోజువారీ డేటాతో ప్లాన్ ధర రూ.719 నుండి రూ.859కి పెరిగింది. అలాగే 84 రోజుల పాటు 2GB రోజువారీ డేటాతో ప్లాన్ ధర గతంలో రూ.839గా ఉండేది. కానీ ఇప్పుడు రూ.979కి చేరింది. ఇది కాకుండా మొత్తం సంవత్సరానికి 2.5 GB రోజువారీ డేటాతో ప్లాన్ ధర గతంలో రూ.2,999గా ఉండేది కానీ ఇప్పుడు అది రూ.3599కి చేరింది.

Also Read: Bajaj Freedom CNG Bike Mileage: బజాజ్ CNG.. ఇలా చేస్తే ఎక్కువ మైలేజీ!

పెరిగిన జియో ప్లాన్ ధరలు

అగ్ర టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రముఖ ప్లాన్‌ల ధరలను కూడా పెంచింది. కంపెనీ రెండు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇంతకు ముందు రూ.1559, రూ. 2999కి అందుబాటులో ఉండేవి. కానీ అవి ఇప్పుడు ధర రూ.1899, రూ.3599కి పెరిగింది. అలాగే 28 రోజుల పాటు 2GB రోజువారీ డేటాతో ప్లాన్ ధర గతంలో రూ.299గా ఉండేది.. కానీ ఇప్పుడు రూ.349గా మారింది. అదే సమయంలో 28 రోజుల పాటు 1.5 GB రోజువారీ డేటాతో ప్లాన్ ధర గతంలో రూ.239గా ఉండేది.. కానీ ఇప్పుడు రూ.299గా మారింది. అలాగే 28 రోజుల పాటు 3 GB రోజువారీ డేటాతో ప్లాన్ ధర గతంలో ఉన్నట్లుగానే రూ.449గా ఉంది.

Related News

Gold Rate Today: బ్రేకుల్లేకుండా పెరుగుతున్న బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

Post Retirement Income: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. లక్ష ఆదాయం.. ఈ పొదుపు ప్రణాళిక ఫాలో అవ్వండి?

Malabar Gold & Diamonds: మలబార్ అద్భుతమైన ఆఫర్.. గోల్డ్ & డైమండ్స్‌ ఛార్జీలపై 30% తగ్గింపు, చలో ఇంకెందుకు ఆలస్యం

Digital Currency: ఇండియాలో డిజిటల్ కరెన్సీ.. క్రిప్టో కరెన్సీని నో ఛాన్స్, మంత్రి గోయల్ క్లారిటీ

EPFO Pension Hike: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. కనీస పెన్షన్ ​​రూ. 2,500 పెంచే ఛాన్స్

Gold Markets: దేశంలో అతిపెద్ద బంగారం మార్కెట్లు.. ఇక్కడ వేలకొద్ది గోల్డ్ షాపులు, లక్షల కోట్ల వ్యాపారం

Today Gold Price: బిగ్ బ్రేకింగ్.. 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు

Mugdha 2.0: కూకట్ పల్లిలో సరికొత్తగా ముగ్ధా 2.0.. ప్రారంభించిన ఓజీ బ్యూటీ ప్రియాంక మోహనన్!

Big Stories

×