BigTV English

BSNL Sim Home Delivery: స్పీడ్ పెంచిన BSNL.. ఇంటికే సిమ్ కార్డ్.. ఈ స్టెప్స్ పాటించండి!

BSNL Sim Home Delivery: స్పీడ్ పెంచిన BSNL.. ఇంటికే సిమ్ కార్డ్.. ఈ స్టెప్స్ పాటించండి!

BSNL Sim Home Delivery: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్ ప్లాన్‌లను 15 నుంచి 20 శాతం  వరకు పెంచేశాయి. దీంతో అందరిచూపు ఒక్కసారిగా ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్‌పై పడింది. ఈ క్రమంలో  BSNL తన వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెరిగినప్పటి నుంచి BSNL కస్టమర్లను విపరీతంగా పెంచుకుంది. ఇప్పుడు కోట్లాది మంది వినియోగదారుల కోసం BSNL కొత్త ఆఫర్లను తీసుకువస్తోంది.


మీరు BSNL  కొత్త SIM కొనుగోలు చేయాలనుకుంటే కంపెనీ తన వినియోగదారుల కోసం ఒక గొప్ప ఆఫర్‌ను తీసుకొచ్చింది. మీరు కొత్త BSNL సిమ్‌ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు కొత్త సిమ్ పొందడానికి ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. కంపెనీ మీ ఇంటికి ఉచితంగా సిమ్‌ని డెలివరీ చేస్తుంది. మీరు పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్‌లను ఉచితంగా ఆర్డర్ చేయవచ్చు.

మీరు ఇంట్లో కూర్చొని ఉచితంగా BSNL సిమ్‌ని ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం మీరు ఒక్క రూపాయి కూడా అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కూడా BSNL ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే దీని కోసం సులభమైన స్టెప్స్ ఫాలో లావాల్సి ఉంటుంది. BSNL ఉచిత SIM కార్డ్ డెలివరీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఈ విధంగా ఉచిత BSNL సిమ్ కార్డ్ పొందండి

  • ముందుగా BSNL అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  • ఇక్కడ మీరు మీ లొకేషన్‌ను ఎంచుకోండి.
  • నెక్స్ట్ స్టెప్‌లో మీకు BSNL ప్లాన్‌ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
  • దీని తర్వాత  మీరు SIM కార్డ్ డెలివరీ కోసం మీ అడ్రస్‌ను నమోదు చేయాలి.
  • పూర్తి వివరాలను అందించిన తర్వాత, మీ ఇంటికి కొత్త BSNL సిమ్ డెలివరీ అవుతుంది.

Jio-Airtel నుండి BSNLకి నంబర్‌ను పోర్ట్ చేయడం ఎలా?

  • Jio-Airtel నుండి BSNLకి పోర్ట్ చేయడానికి, మీరు ముందుగా 1900కి SMS పంపాలి.
  • మీరు మెసేజ్ బాక్స్‌లో PORT అని వ్రాయాలి, స్పేస్ ఇచ్చి  మీ మొబైల్ ఎంటర్ చేయాలి.
  • మీరు జమ్మూ కాశ్మీర్‌లో నివసిస్తుంటే BSNLకి పోర్ట్ చేయడానికి 1900కి కాల్ చేయాల్సి ఉంటుంది.
  • మీకు ప్రత్యేకమైన పోర్టింగ్ కోడ్ వస్తుంది. అది 15 రోజుల పాటు ఉంటుంది.
  • తర్వాత మీరు BSNL సేవా కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది.
  • ఇక్కడ మీరు ఇతర ముఖ్యమైన సమాచారంతో పాటు ఆధార్ కార్డు డేటా అందించాలి.
  • దీని తర్వాత మీరు కొత్త BSNL సిమ్ అందుకుంటారు.
  • మీరు పోర్ట్ కోసం కొంత డబ్బు చెల్లించవలసి ఉంటుంది.
  •  మీరు మరొక టెలికాం ఆపరేటర్‌కి మారడానికి 7 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×