E-Paper
Advertisement

Cooking Oil Rates: వార్ ఎఫెక్ట్ వంట గదిపై.. షాకిస్తున్న నూనె ధరలు

Cooking Oil Rates: వార్ ఎఫెక్ట్ వంట గదిపై.. షాకిస్తున్న నూనె ధరలు
Advertisement

Cooking Oil Rates: ఇరాన్-ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధం ఎఫెక్ట్ భారత్ పై పడుతుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగగా.. తాజాగా వంట నూనె ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. యుద్ధ ప్రభావంతో ప్రపంచ సరుకు రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్‌కు దిగుమతి అయ్యే వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

వంట నూనె ధరలు

సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్ కు రూ.150-రూ.170 పెరిగింది. ఒక్క వారంలోనే రూ.20 పెరుగుదల నమోదు చేసింది. పామాయిల్ లీటర్‌కు రూ.15–రూ.20 వరకు పెరిగింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో వినియోగదారులు ముందుగానే నూనె కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.

ఇంటి బడ్జెట్ పై ఎఫెక్ట్

Advertisement

దేశంలోని అనేక ప్రాంతాలలో వంట నూనె ధరలు పెరిగాయి. దీంతో గృహ బడ్జెట్లపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, సరుకు రవాణా అంతరాయాలు, ముడి చమురు ధరలు పెరుగుదలతో ఇంటి బడ్జెట్ ఇబ్బందిగా మారింది. ఇటీవల సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, పామాయిల్ ధరలు హోల్‌సేల్ మార్కెట్లలో దాదాపు 5 శాతం పెరిగాయి. అనేక నగరాల్లో, రిటైల్ ధరలు లీటర్ కు రూ.3 నుంచి రూ.20 వరకు పెరిగాయి.

షిప్పింగ్ ఖర్చులు, రవాణా

వంట నూనెల ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం ప్రపంచ ముడి చమురు ధరల పెరుగుదల అని నిపుణులు అంటున్నారు. ముడి చమురు రవాణాకు ఆటంకం, షిప్పింగ్ ఖర్చులు పెరగడంతో వంట నూనె ధరలపై ప్రభావం పడింది. భారతదేశం వంట నూనె అవసరాలలో ఎక్కువ భాగం ఇండోనేషియా, మలేషియా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.

Advertisement

Also Read:  21 రోజుల తర్వాతే గ్యాస్ బుకింగ్.. కొత్త రూల్స్ ఇవే

మరింత పెరిగే ఛాన్స్

మిడిల్ ఈస్ట్ లో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో సరకు రవాణా సప్లై చైన్ దెబ్బతింది. ఫలితంగా, అనేక మార్కెట్లలో టోకు వంట నూనె ధరలు పెరిగాయి. ఈ ప్రభావం రిటైల్ కస్టమర్లపై పడింది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల బయోడీజిల్ ఉత్పత్తికి వెజిటెబుల్ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది వంట నూనెల లభ్యతను తగ్గిస్తుంది, తద్వారా ధరలపై మరింత ఒత్తిడిని పెరుగుతుంది. రాబోయే వారాల్లో వంట నూనెల ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×