దేశ వ్యాప్తంగా వినయోగదారులకు తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులను అందించడంలో డిమార్ట్ ముందుంటుంది. ఏ సూపర్ మార్కెట్లో లభించని ఆఫర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువులలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ అందించినట్లుగానే నిత్యవసర సరుకులు, గృహోపకరణాలకు సంబంధించి డి మార్ట్ ప్రతి రోజూ భారీ తగ్గింపులు అందిస్తుంది. గత నెలలో దసరా, దీపావళి సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు అందించిన డిమార్ట్.. ఈ నవంబర్ లోనూ అద్భుతమైన డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ నెలలో డిమార్ట్ లో 70% వరకు డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. ఒకవేళ మీరూ నిత్యవసర సరకులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే డిమార్ట్ కు వెళ్లండి. తక్కువ ఖర్చుతో ఇంట్లోకి అవసరమైన సరుకులు తెచ్చుకోండి.
డిమార్ట్ ప్రతి రోజూ ఏదో ఒక ఆఫర్ అందిస్తూనే ఉంటుంది. ఏడాదంతా ఈ సూపర్ మార్కెట్ లో క్రేజీ తగ్గింపులు ఉంటాయి. ఈ సంవత్సరం దీపావళి తర్వాత కూడా 70-80 శాతం డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. రోజువారీ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, నిత్యవసర సరుకులపై తగ్గింపులు అందిస్తోంది. ఇప్పుడు మనం ఏ వస్తువులు, ఎంత డిస్కౌంట్ అందుబాటులో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రస్తుతం, DMartలో కిరాణా సామాన్లపై 50% వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే, జున్ను, పెరుగు మొదలైన పాల ఉత్పత్తులపై 40% తగ్గింపు అందుబాటులో ఉంది. హౌస్ క్లీనింగ్ వస్తువులపై ఈ సూపర్ మార్కెట్ 60% తగ్గింపు అందిస్తోంది. అటు కస్టమర్లకు డిటర్జెంట్ పౌడర్, సబ్బులు, క్లీనింగ్ స్ప్రే ప్యాక్ లపై ఒకటి కొంటే ఒకటి ఉచిత ఆఫర్ ఇస్తోంది. అలాగే, వ్యక్తిగత సంరక్షణ, బ్యూటీ ఉత్పత్తులకు డిస్కౌంట్ ఆఫర్లలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. షాంపూ, కండిషనర్, డియోడరెంట్, స్కిన్ కేర్ ఉత్పత్తులపై 70% తగ్గింపు పొందే అవకాశం కల్పిస్తోంది. దీనితో పాటు లోషన్, క్రీమ్ కాంబో ప్యాక్ పై కూడా రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఇక పెర్ఫ్యూమ్స్, సౌందర్య సాధనాలపై 30% తగ్గింపు అందిస్తోంది డిమార్ట్.
Read Also: టాటా సంస్థ.. మోటార్ సైకిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా?
అటు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఏకంగా 80 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. ఫ్యాన్లు, ఐరన్ బాక్స్ లు, లైట్లు లాంటి వస్తువులపై 80% తగ్గింపు అందుబాటులో ఉంది. కార్తీక పౌర్ణమి కావడంతో ఇంటికి అలంకరించే విద్యుత్ లైట్ల పైనా మంచి తగ్గింపు ఇస్తుంది. ఆఫ్ సీజన్ తో పాటు సీజన్ సమయంలోనూ డిమార్ట్ తన కస్టమర్లకు 80% వరకు తగ్గింపు అందిస్తుంది. ప్రజలకు భారీగా డబ్బు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో వస్తువులు అయిపోయినట్లు అనిపిస్తే, వెంటనే డిమార్ట్ కు వెళ్లండి.. క్రేజీ తగ్గింపును ఉపయోగించుకోండి.
Read Also: పొరపాటున వేరే UPIకి డబ్బులు పంపించారా? సింపుల్ గా ఇలా చేస్తే రిటర్న్ వచ్చేస్తాయ్!