Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా 61వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో కంటెండర్ రేస్ లో పాల్గొంటున్న ఇంటి సభ్యుల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రీతూ చౌదరి, దివ్య నికిత మధ్య సాయి చిచ్చుపెట్టేశారు. మరి అసలేం జరిగింది? వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడాలి అంటే కంటెండర్ రేస్ లో తప్పనిసరిగా పాల్గొనాలి. కానీ ఈ కంటెండర్ రేస్ లో భాగంగా నామినేట్ చేసి వారిని రేస్ నుంచి తప్పించే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించారు. ఇక అలా తాజాగా ఒక కొత్త టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్ . అందులో ఒక ట్రైన్ ఏర్పాటు చేయగా బజర్ మోగితే ..ఎవరైతే ముందుగా వెళ్లి డ్రైవర్ సీట్ లో కూర్చుంటారో వారు.. ఒకరిని సరైన కారణాలు చెప్పి కంటెండర్ రేస్ నుంచి తప్పించవచ్చు అని బిగ్ బాస్ టాస్క్ గురించి వివరిస్తారు.
ఇక టాస్క్ లో భాగంగా సాయి అవకాశాన్ని దక్కించుకుంటాడు. ఇక సాయి ఎవరిని కంటెండర్ షిప్ నుంచి తొలగించాలి అని ఆలోచిస్తుండగా.. రీతు దివ్య వైపు చూపిస్తూ సైగ చేసింది. ఇక దాంతో దివ్య పేరు చెప్పారు సాయి. ఆ తర్వాత సాయి మాట్లాడుతూ.. నేను సేఫ్ గేమ్ ఆడట్లేదు అని చెప్పగా.. పర్లేదు తీసేయ్ మంచి కంటెండర్ అని చెప్పిన వ్యక్తి.. కంటెండర్ రేస్ నుంచి తీస్తే ఏంటి సాయి మరి అది అంటూ దివ్య ప్రశ్నించింది. అయితే బిగ్ బాస్ సాయి నీ నిర్ణయాన్ని చెప్పు అని అడగగా.. అటు రీతు చౌదరి దండం పెడుతూ కళ్ళు పెద్దవి చేసి సాయి నిర్ణయం కోసం చూస్తున్న సమయంలో సాయి సడన్గా రీతు చౌదరి పేరు తెలిపారు.
దివ్యని తీస్తాడు అనుకున్న సాయి తననే తీసేసరికి కోపంతో ఊగిపోయింది రీతు. అసలు ఎందుకు తీస్తున్నావో అది చెప్పు నువ్వు తీస్తున్నది కెప్టెన్సీ టాస్క్ నుంచి అంటూ ఫైర్ అయ్యింది. పక్క వాళ్ళు చెప్పిన మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీ ట్రైన్ ఎక్కించి ఇప్పుడు నన్నే రేస్ నుంచి తప్పిస్తున్నావా అంటూ ఫైర్ అయ్యింది. అంతేకాదు నువ్వే కదా దివ్యను తీస్తానని చెప్పావు. మళ్ళీ నన్ను తీయడం ఏంటి అంటూ ఇలా ఇద్దరి మధ్య గొడవలు క్రియేట్ అయ్యాయి. ఆ తర్వాత దివ్య ముందే చెప్పి మరి ఇలా చేయడం ఏమిటి అయినా నేను కెప్టెన్ అయ్యాను.. డోంట్ కేర్ అంటూ లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మొత్తానికైతే సాయి కన్ఫ్యూజన్ వల్ల ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు.