E-Paper
Advertisement

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌
Advertisement

Shivam Dube:  టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ శివమ్ దూబే ( Shivam Dube) కెరీర్ ను గౌతమ్ గంభీర్ నాశనం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బలవంతంగా టీమిండియా జట్టులోంచి శివమ్ దూబేను బయటకు పంపించేందుకు గౌతమ్ గంభీర్ పన్నాగం పన్నాడని టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా శివమ్ దూబేను బలి పశువు చేసే ప్రయత్నం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపి శివమ్ దూబేను ఆడుకుంటున్నాడని గౌతమ్ గంభీర్ పై ఫైర్ అవుతున్నారు.

Also Read: Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

శివమ్ దూబే కెరీర్ నాశనం చేస్తున్న గౌతమ్ గంభీర్

Advertisement

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నిన్న నాలుగో టీ20 జరిగిన సంగతి తెలిసిందే. క్వీన్స్ ల్యాండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. బ్యాటర్లతో పాటు బౌలర్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో టీమిండియా 167 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆస్ట్రేలియా దారుణంగా విఫలమైంది. 18.2 ఓవర్లలో 119 పరుగులు చేసి ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా. ఈ దెబ్బకు టీమ్ ఇండియా విజయం సాధించి సిరీస్ లో కూడా లీడింగ్ సంపాదించగలిగింది.

అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ వికెట్ కోల్పోగానే శివమ్ దూబేను బరిలోకి దింపారు. మూడో స్థానంలో బ్యాటింగ్ తాను చేయబోనని పదేపదే శివమ్ దూబే మొత్తుకున్నారట. అయినా కూడా గౌతమ్ గంభీర్ ఫోర్స్ చేసి మరి, ఈ మూడో స్థానంలో పంపించారట. మూడో స్థానంలో వెళ్లిన శివమ్ దూబే 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత వెంటనే ఔట్ అయ్యాడు. అదే ఐదు లేదా ఆరో స్థానంలో శివమ్ దూబే వచ్చి ఉంటే, టీమిండియా మరింత పరుగులు చేసేది. కేవ‌లం హర్షిత్ రాణా కోసం ఈ కుట్రలు గౌతమ్ గంభీర్ పన్నాడని అంటున్నారు. వరుసగా శివమ్ దూబే విఫలమైతే, అతన్ని బయటకు పంపించి ఆల్ రౌండ‌ర్‌ రూపంలో హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకువచ్చేందుకు గౌతమ్ గంభీర్ ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

Also Read: Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

మొన్నటి వరకు అర్షదీప్.. ఇప్పుడు శివమ్ దూబే

మొన్నటి వరకు అర్షదీప్ సింగ్‌ కు టీమిండియా తుది జట్టులో అవకాశం రాకుండా చేసిన గౌతమ్ గంభీర్.. తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే విమర్శలు వచ్చిన నేపథ్యంలో హర్షిత్ రాణాను పక్కకు పెట్టి అర్షదీప్‌ సింగ్ ను బరిలోకి దింపారు. దానికి తగ్గట్టుగానే అర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆల్ రౌండ‌ర్‌ గా ఉన్న శివమ్ దూబేను జట్టులో నుంచి బయటకు పంపిస్తే, హర్షిత్ రాణా కచ్చితంగా టీమిండియాలో ఛాన్స్ దక్కించుకుంటాడని గౌతమ్ గంభీర్ స్కెచ్ వేశారట. అందుకే శివమ్ దూబే ఎప్పుడు ఆడని బ్యాటింగ్ ఆర్డర్ ను కేటాయిస్తున్నాడట గౌతమ్ గంభీర్. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

?igsh=bzR4ZzZiaXdmdGg2

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×