BigTV English
Advertisement

Wrong UPI Payment: పొరపాటున వేరే UPIకి డబ్బులు పంపించారా? సింపుల్ గా ఇలా చేస్తే రిటర్న్ వచ్చేస్తాయ్!

Wrong UPI Payment: పొరపాటున వేరే UPIకి డబ్బులు పంపించారా? సింపుల్ గా ఇలా చేస్తే రిటర్న్ వచ్చేస్తాయ్!

డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయిన తర్వాత ఎవరూ తమ పర్సులో డబ్బులు పెట్టుకోవడం లేదు. రూ. 5, రూ. 10 కూడా UPI ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో అయితే నేరుగా బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. అయితే, కొన్నిసార్లు పొరపాటుగా ఒకరికి బదులుగా మరొకరికి పంపించిన సందర్భాలున్నాయి. ఇప్పటి వరకు అలా పంపించిన డబ్బులు వెనక్కి తచ్చుకోవడం చాలా కష్టమైన పనిగా ఉండేది. కానీ, ఇకపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా కొన్ని టిప్స్ పాటిస్తే మళ్లీ మీ డబ్బులను వెనక్కి తెచ్చుకోవవచ్చు. ఇంతకీ అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


పొరపాటుగా తప్పు UPI IDకి డబ్బు పంపితే?

UPI ద్వారా డబ్బు బదిలీ చేయడం చాలా ఈజీ. కానీ, తొందరపాటు, టైపింగ్ లాంటి పొరపాట్ల కారణంగా తప్పు UPI IDకి డబ్బు పంపిస్తే టెన్షన్ అవుతుంది. కానీ, ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. UPI లావాదేవీలు NPCI ద్వారా కంట్రోల్ చేయబడుతాయి. వారు డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం అందిస్తారు. ట్రాన్సాక్షన్ తర్వాత 10 నిమిషాల్లోగానే కాంటాక్ట్ చేస్తే రిఫండ్ అవకాశం ఎక్కువ. ఆలస్యం చేస్తే డబ్బు రిసీవర్ ఉపయోగిస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

తప్పు UPI ట్రాన్సఫర్ నుంచి డబ్బు తిరిగి ఎలా పొందాలంటే?  

⦿ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చెక్ చేయండి: మీ UPI యాప్ లో ట్రాన్సాక్షన్ హిస్టరీ తెరిచి, లావాదేవీ ID, పంపిన మొత్తం,  తప్పు UPI ID సహా పూర్తి వివరాలను నోట్ చేసుకోవాలి. ఈ వివరాలు ఫిర్యాదు చేసేటప్పుడు అవసరం.


⦿ రిసీవర్‌ని కాంటాక్ట్ చేయండి:  తప్పు UPI IDకి మొబైల్ నంబర్, ఈమెయిల్ తెలిస్తే, వారిని కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి డబ్బు రిటర్న్ చేయమని అడగండి. చాలామంది సహకరిస్తారు. ముఖ్యంగా పంపిన మొత్తం తక్కువగా ఉంటే వెంటనే పంపిస్తారు.

⦿ మీ UPI యాప్ ద్వారా ఫిర్యాదు చేయండి: Google Payలో ‘Help’ > ‘Transaction Issue’ > ‘Report a Problem’ సెలెక్ట్ చేసి, డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. PhonePeలో ‘My Money’ > ‘Transaction History’ > రాంగ్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ > ‘Report Problem’. Paytmలో ‘Paytm Postpaid’, ‘Banking’ సెక్షన్‌లో ‘Dispute’ ఆప్షన్. యాప్ సపోర్ట్ టీమ్ వెంటనే రెస్పాన్స్ ఇస్తుంది. NPCIకి ఎస్కలేట్ చేస్తుంది.

⦿ మీ బ్యాంక్‌ని కాంటాక్ట్ చేయండి: మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయండి. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ షేర్ చేసి, ‘Wrong Remittance’ కంప్లైంట్ ఫైల్ చేయించండి. బ్యాంక్ 30 రోజుల్లోపు ఇన్వెస్టిగేట్ చేసి రిఫండ్ ప్రాసెస్ చేస్తుంది.

⦿ NPCI, RBIకి ఫిర్యాదు చేయండి:  యాప్/బ్యాంక్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే, NPCI UPI Dispute Redressal Mechanismని ఉపయోగించండి. లేదంటే RBI Ombudsmanకి కాల్ చేయండి: వారు 30 రోజుల్లోపు రిజాల్వ్ చేస్తారు.

వీలైనంత వరకు డబ్బులు పంపించే సమయంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. అదే సమయంలో తక్కువ మొత్తంలో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలి.

Read Also: నవంబర్ 1 నుంచి కొత్త ఆధార్ రూల్స్, అలా చేయకపోతే పాన్ కార్డ్ ఔట్!

Related News

Gold Silver Rates: దిగిరానున్న బంగారం, వెండి ధరలు.. దిగుమతులపై బేస్ రేటు తగ్గించిన కేంద్రం

Postal Senior Citizens Scheme: సీనియర్ సిటిజన్స్ కు సూపర్ సేవింగ్స్ స్కీమ్.. రూ.30 లక్షల డిపాజిట్ పై రూ. 12.30 లక్షల వడ్డీ

LPG Gas Price: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు.. చిరు వ్యాపారులకు స్వల్ప ఊరట

Tata Bike 125 CC: టాటా సంస్థ.. మోటార్ సైకిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా?

Today Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Mukunda Jewellery: హైదరాబాద్‌లో ముకుందా జ్యువెలరీ పూర్వి గ్రాండ్ ఓపెనింగ్..

Financial Changes: ఆధార్ నుంచి బ్యాంక్ వరకు.. నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే

Big Stories

×