BigTV English

Dussehra : దసరా బోనస్​ వచ్చిందా? – ఇలా చేస్తే మరింత ఎక్కువ సంపాదించొచ్చు!

Dussehra : దసరా బోనస్​ వచ్చిందా? – ఇలా చేస్తే మరింత ఎక్కువ సంపాదించొచ్చు!

Dussehra : దసరా, దీపావళి పండగల సందర్భంగా ఉద్యోగస్థులకు తమ సంస్థ యాజమాన్యాలు బోనస్​లను ఇస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఉద్యోగి స్థాయి ఆధారంగా రూ. వేల నుంచి రూ.లక్షల వరకు ఇది ఉంటుంది. చాలా మందికి ఈ పాటికి వచ్చే ఉంటుంది. దీన్ని చాలా మంది ఇచ్చినప్పుడు ఉపయోగించేస్తుంటారు. అనవసర ఖర్చులు కూడా చేస్తుంటారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు పలువురు.


బోనస్​గా వచ్చిన డబ్బును సక్రమంగా వినియోగిస్తే ఆర్ధిక ప్రణాళికకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఒకవేళ మీరు బోనస్​ ఖర్చు పెట్టకపోయి ఉంటే, దాంతో ఉపయోగపడేలా, మరింత ఆదాయం వచ్చేలా ఏం చేయచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.

రుణాలు తీర్చుకోండి – మీకేమైనా చిన్న మొత్తాల్లో అప్పులు, లేదా వ్యక్తిగత, గృహ రుణాలుంటే త్వరగా వాటిని బోనస్ డబ్బులతో తీర్చేసుకోండి. దీంతో కొంచెం భారం తగ్గుతుంది.


అత్యవసర నిధిలో జమ – ప్రతి వ్యక్తి 6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని తప్పకుండా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ అంత మొత్తం ఏర్పాటు చేసుకోకపోయి ఉంటే, ఈ బోనస్​ను అత్యవసర నిధిలో జమ చేయండి.

పొదుపు చేయండి – బోనస్ డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్డ్​ డిపాజిట్ చేయడం మంచిది. కొంతకాలం తర్వాత దానికి వడ్డీ కూడా వస్తుంది. అప్పుడు మీరు ఎక్కువ మొత్తంలో పొందవచ్చు. అలా బోనస్తోనూ ఆదాయం ఎంచక్కా పెంచుకోవచ్చు.

షేర్లు – స్టాక్ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ ఇది చాలా రిస్క్​తో కూడుకున్న పని. ఎంతో అనుభవం, పూర్తి అవగాహన ఉంటేనే ఇలా చేయాలి. లేదంటే పెట్టకపోవడమే ఉత్తమం.

మదుపు – మ్యూచువల్ ఫండ్స్​లో రిస్క్ తక్కువ ఉంటుంది. దీర్ఘ కాలంలో మంచి లాభాలు వస్తాయి. కాబట్టి బోనస్​ను పెట్టుబడిగా ఇందులో పెట్టుకోవచ్చు.

బంగారం – బంగారం కొనుగోలు ఉత్తమం. ఇది ఎన్నో తరాల నుంచి వస్తున్న సంప్రదాయ పెట్టుబడి. డబ్బుకు ఏ ఢోకా ఉండదు. లేదంటే ప్రభుత్వం అందించే గోల్డ్ బాండ్స్​లోనూ పెట్టుబడులు పెట్టండి. గోల్డ్ పైన పెట్టుబడి ఎప్పటికీ వృథా కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకొని కొంటే భవిష్యత్తులో ఎంచక్కా ఉపయోగపడుతుంది.

స్కిల్స్ – మీ వృత్తిలో మరింత నైపుణ్యం పొందాలనుకుంటే ఆ డబ్బులతో కోర్సులను నేర్చుకోండి. అంటే మీ పెట్టుబడి వృథా అవ్వొద్దు. తద్వారా ఉద్యోగ స్థాయిలో మరింత పైకి వెళ్లొచ్చు. స్థాయికి తగ్గట్టుగా జీతం కూడా పొందవచ్చు.

షాపింగ్ – ఇవన్నీ కాకుండా మీకు అస్సలు ఆర్థిక ఇబ్బందులు లేవనుకుంటే అప్పుడు బోనస్ డబ్బులతో పండగ చేసుకోండి. ఫ్యామిలీని షాపింగ్​కు తీసుకెళ్లండి. వారితో సరదాగా గడపండి. ఎప్పటి నుంచే కొని ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఏదైనా కావల్సిన వారికి కొని ఇవ్వవచ్చు.

దానం – దానం చేస్తే పుణ్యం దక్కుతుందంటారు కగా. కాబట్టి అవసరాల్లో ఉన్న వారికి ఈ బోనస్ డబ్బులో ఎంత కొంత ఇచ్చి ఆదుకోండి. లేదంటే స్వచ్ఛంద సంస్థలకు డొనేట్ చేయండి. అది కూడా వీలును బట్టి చేయాలని ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకోకూడదని హెచ్చరిస్తున్నారు.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×