New Rules from October 1: పేద-మధ్య-ఉన్నతి వర్గాల ప్రజలకు అలర్ట్. అక్టోబర్ ఒకటి నుండి రైల్వే ప్రయాణికులు, డిజిటల్ చెల్లింపులు, పెన్షన్ చందాదారులు, LPG సిలిండర్లను ఉపయోగించే కుటుంబాలపై ప్రభావం చూపే ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. వాటిలో బ్యాంకింగ్, రైల్వే, పోస్టల్, పెన్షన్ వంటివి ఉన్నాయి. నాణ్యమైన సేవలు, భద్రత, పారదర్శక కోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది ప్రభుత్వం. వాటి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.
చెక్కుల క్లియరెన్స్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కొత్తగా కంటిన్యూయస్ చెక్ క్లియరింగ్ పద్దతిని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు చెక్‌లు బ్యాచ్‌ల్లో క్లియర్ అయ్యేవి, ఇకపై కొత్త విధానం అమల్లోకి రానుంది. తొలి విడత అక్టోబర్ 4 నుంచి అమలు చేయనుంది. రెండో దశ వచ్చే ఏడాది జనవరి 3 నుంచి అమలు చేయనుంది. శుక్రవారం నుంచి చెక్ క్లియరింగ్‌ను వేగవంతం చేసి బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేస్తోంది. కొన్ని గంటల్లో చెక్‌లు క్లియర్ అవుతాయి.
రైల్వే రిజర్వేషన్లు
బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు రైల్వే రిజర్వేషన్‌లో కొత్త పద్దతి తీసుకొచ్చింది. IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా జనరల్ టికెట్లు, ఆన్‌లైన్ రిజర్వేషన్ కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆధార్ ధృవీకరణ వినియోగదారులకు కొత్త బుకింగ్ విధానం మరింత ఈజీ కానుంది. టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్‌లో పారదర్శకత పెంచడానికి రూపొందించారు. వీటివల్ల టికెట్ బుకింగ్స్ లో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టనుంది.
UPI లావాదేవీలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI కింద డిజిటల్ లావాదేవీలు గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. రోజువారీ లావాదేవీ పరిమితిని లక్ష నుండి 5 లక్షలకు పెంచింది. దీనివల్ల వినియోగదారులు తరచుగా బ్యాంకులకు వెళ్లే అవసరం తగ్గుతుంది. ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి కలెక్ట్ రిక్వెస్ట్ లేదా పుల్ ఫీచర్ నిలిపి వేయబడింది. కస్టమర్‌లు ఆటోమేటిక్ డెబిట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవచ్చు.
ALSO READ: ఆందోళనలో టీసీఎస్ ఉద్యోగులు.. 30 వేల ఉద్యోగాలకు ఎసరు
పోస్టల్ సేవల్లో కూడా
ఇండియాలో పోస్టల్ సర్వీసులు మారనున్నాయి. అక్టోబర్ 1 నుంచి స్పీడ్ పోస్ట్ రుసుములను సవరించింది ప్రభుత్వం.జీఎస్టీ విడిగా ఉంటుంది. కస్టమర్లకు OTP ఆధారిత డెలివరీ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
NPS-UPS ల్లో కీలక మార్పులు
నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్-UPSలో కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ-PFRDA కొత్త రుసుములను నిర్ణయించింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త సంస్కరణతో ప్రైవేటు రంగానికి చెందిన ఎన్పీఎస్ చందాదారులు తమ కాంట్రిబ్యూషన్లో 100 శాతం ఈక్విటీలలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. PRAN కింద వివిధ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలతో ఒకటి కంటే ఎక్కువ పథకాలను కలిగి ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2025 సెప్టెంబర్ 30 వరకు NPS నుంచి UPS కు మారవచ్చు. ఆ తర్వాత ఆ ఛాన్స్ ఉండదు, UPSలో ఉన్న ఉద్యోగులు రిటైర్మెంట్ ముందు NPSకి తిరిగి మారవచ్చు.
బ్యాంకింగ్ సేవల్లో కూడా
HDFC బ్యాంక్ కొత్త రూల్స్ వచ్చాయి. అక్టోబర్ 1 నుండి ప్రీమియం సేవలకు కొత్త నియమాలను అమలు చేస్తామని గతంలో HDFC బ్యాంక్ ఇంపీరియా కస్టమర్లకు తెలిపింది. జూన్ 30, 2025న లేదా అంతకు ముందు చేరినవారు తమ ప్రీమియం బ్యాంకింగ్ అధికారాలను నిలుపుకోవడానికి సవరించిన మొత్తం సంబంధ విలువ ప్రమాణాలను కలిగి ఉండాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవా రుసుములను సవరించింది.కస్టమర్లు అక్టోబర్ 1 నుండి లాకర్ల కోసం కొన్ని సేవా అభ్యర్థనల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మార్పులు లాకర్ పరిమాణం, సంబంధిత బ్రాంచ్‌పై ఆధారపడి ఉంటాయి.