October Bank Holidays: మన జీవితంలో డబ్బు అంటే ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. డబ్బు పనులన్నీ జరగడానికి మనం ఎక్కువగా ఆధారపడేది బ్యాంకులపైనే. అయితే ఈ అక్టోబర్ నెలలో ఒక షాకింగ్ న్యూస్ వుంది. మొత్తం ఇరవై ఒక రోజులు బ్యాంకులు మూసివేయబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే.
ప్రతి సంవత్సరం పండగల కాలంలో బ్యాంక్ హాలిడేల సంఖ్య పెరుగుతుంటుంది. ఈసారి అక్టోబర్‌లో దాదాపు అన్ని ముఖ్యమైన పండగలు వరుసగా రావడంతో సెలవులు ఎక్కువగా చేరాయి. గాంధీ జయంతి, దసరా, దీపావళి, ఈద్ మిలాద్, మహా అష్టమి, నవమి, నరక చతుర్దశి ఇలా అనేక పండగలు ఈ నెలలోనే ఉన్నాయి. వీటికి తోడు రెండో శనివారాలు, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా కలిపితే మొత్తం 21 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి.
అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సెలవులు రాష్ట్రానికో, పండుగలకో అనుగుణంగా ఉంటాయి. అంటే అన్ని రాష్ట్రాల్లో ఒకేరోజు బ్యాంకులు మూసివేయబడవు. ఉదాహరణకు దసరా, దీపావళి లాంటి జాతీయ స్థాయి పండగలకు అన్ని చోట్లా బ్యాంకులు మూసివేయబడతాయి. కానీ కొన్ని పండగలు మాత్రం కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవుతాయి. అందుకే మీ రాష్ట్రానికి సంబంధించిన RBI హాలిడే లిస్ట్ చూసుకోవడం తప్పనిసరి.
Also Read: New Rules from October 1: పలు రంగాల్లో ఆర్థిక లావాదేవీలు.. అక్టోబర్ ఒకటి నుంచి కీలక మార్పులు
ఇంకా ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే, బ్యాంకులు మూసివున్నా మనకు డబ్బు కొరత రాదు. ఎందుకంటే UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్స్, ATMలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ లాకర్ ఓపెనింగ్, చెక్ క్లియరింగ్, డిమాండ్ డ్రాఫ్ట్స్ వంటి ప్రత్యక్షంగా బ్యాంక్‌లో చేయాల్సిన పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలి. లేకపోతే చివరి నిమిషంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
అక్టోబర్ అంటే పండగల మాసం. దసరా ఉత్సవాలు, దీపావళి సందడి, ఆపై చిన్న చిన్న స్థానిక పండగలు అన్నీ కలిపి ఈసారి బ్యాంకులకు కూడా పెద్ద హాలిడే సీజన్ వచ్చింది. కాబట్టి ఎవరైనా ట్రావెల్ ప్లాన్స్ చేసుకుంటే, షాపింగ్ చేసుకోవాలనుకుంటే లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటే ముందుగానే సేఫ్‌గా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ అక్టోబర్ నెలలో మనకు పండగల ఆనందం ఉన్నా, బ్యాంకింగ్ పనులు మాత్రం ముందుగానే ప్లాన్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.