Bigg Boss 8 Day 42 Promo2.. ఆరవ వారం హోటల్ టాస్క్ తో పాటు నబీల్ , ప్రేరణ మధ్య గొడవ హైలైట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ వారం మణికంఠ ఎమోషనల్ డ్రామాలు ఆడడం తగ్గించి టాస్క్ లపై ఫోకస్ పెట్టాడు. అయినా సరే వైల్డ్ కార్డు లేడీ కంటెస్టెంట్స్ తో మళ్ళీ హగ్గులు మొదలుపెట్టి తన బుద్ధి చూపించుకున్నాడు.. ఇకపోతే ఈ వారం బాగా పెర్ఫార్మెన్స్ చేసిన వారిలో యష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమెకు బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చేయొచ్చు. అంత బాగా పెర్ఫార్మ్ చేసింది. మరొకవైపు నైనిక కూడా థంప్స్ అప్ గేమ్ ఆడి బైక్ గెలుచుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
మెగా చీఫ్ గా మెహబూబ్..
ఇకపోతే శని, ఆదివారాలలో నాగార్జున కంటెస్టెంట్స్ తప్పొప్పులను బయటపెడుతూ కొంతమందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే.. మరికొంతమందిని పొగడ్తలతో ముంచేత్తుతూ ఉంటాడు. మరి ఈ వారం ఏం జరిగింది అనే విషయం ఇప్పుడు చూద్దాం. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ముందుగా నాగార్జున యష్మీ ,మణికంఠ ఆట తీరును మెచ్చుకొని వారిని పొగడ్తలతో మంచెత్తారు. గతవారం నాగార్జున , హౌస్ మేట్స్ నుండి మణికంఠ కి ఏ రేంజ్ లో కోటింగ్ పడిందో అందరికీ తెలుసు. దాని తర్వాతే మణికంఠలో మార్పు వచ్చింది. అందుకు ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే ..ఇక కొత్త మెగా చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మెహబూబ్ కి కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు నాగార్జున. అయితే ఆయన ఆట మాత్రం మెచ్చుకోలేదు.
గౌతమ్ కి స్ట్రాంగ్ వార్నింగ్..
ఇకపోతే నిఖిల్ కి కూడా నాగార్జున కోటింగ్ ఇచ్చారు. నీలో ఫైర్ బాగా తగ్గిపోయింది. మాకు ఆ ఫైర్ కావాలి అంటూ తెలిపాడు. ఇక నిఖిల్ , సీత ఆడిన దొంగ ఆటలకు సంబంధించిన వీడియో ని కూడా నాగార్జున ప్లే చేసి సీతపై ప్రశంసలు కురిపించాడు. ఇక హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ గా అడుగుపెట్టిన , గత సీజన్ టాప్ కంటెస్టెంట్ గౌతమ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అవినాష్ తో జరిగిన చిన్న గొడవలో అదుపుతప్పిన గౌతమ్ ఏకంగా మైక్ విసిరేసి హౌస్ లోపలికి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో గౌతమ్ ఎమోషనల్ లో నిజాయితీ ఉంది అయితే అంతవరకు కరెక్టే కాని మైక్ విసిరేయడం తప్పు. అందుకు నాగార్జున నుండి పడాల్సినవన్నీ పడిపోయాయి. సీజన్ 7లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న ఈయనకు ఆ బ్రాండ్ ఊరికే రాలేదు అద్భుతంగా ఆడాడు కాబట్టే 13వ వారం వరకు కొనసాగాడు. ఇక అశ్వద్ధామ 2.0 నీకు నువ్వు పెట్టుకుంది కాదు. అది మేము ఇచ్చింది. ఆ పర్ఫామెన్స్ మళ్లీ నువ్వు చూపించు అంటూ గౌతంపై నాగార్జున కోపం వ్యక్తం చేయగా.. గౌతమ్ నుండి ఎటువంటి రెస్పాండ్ వచ్చింది అనేది నేటి ఎపిసోడ్లో తెలుస్తుంది.