Gold Price Today: శ్రావణమాసం తర్వాత బంగారం-వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మదుపరులు కొనుగోళ్లకు పాల్పడడంతో ఒక్కసారిగా ధరలు దిగొస్తున్నాయి. దాని ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. బంగారం ధరలు దిగిరావడంతో మహిళల్లో ఒకటే ఆనందం. దసరాకు కొనుగోళ్లకు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు.
మధ్యప్రాచ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమాంతంగా ఎగిసిన చమురు ధరలు, బలపడుతున్న డాలర్ వంటి పరిణామాలు బులియన్ మార్కెట్‌పై పడ్డాయి. ఫలితంగా మదుపరులు గోల్డ్ నుంచి ఆయిల్, డాలర్ల వైపు మళ్లారు. బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గతవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆగస్టులో అమెరికా సీపీఐ 3.4 శాతం పెరిగింది. అక్టోబర్‌లో ఫెడ్ సమావేశానికి ముందు బులియన్‌పై ఒక్కసారిగా ఒత్తిడి తీవ్రమైంది. ఫలితంగా బంగారం-వెండి ధరలు సామాన్యుడికి అందుబాటలోకి వస్తున్నాయి.
ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4300 డాలర్ల స్థాయికి చేరింది. మంగళవారం కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.24 శాతం తగ్గి ఔన్సుకు 4,341 డాలర్లకు చేరింది. వెండి దాని మునుపటి సెషన్ కంటే 0.50 శాతం పడిపోయి ఔన్సుకు 63.82 డాలర్లకు చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు పతనం అయ్యాయి. ఫలితంగా మహిళల్లో ఎక్కడ లేని ఆనందం నెలకొంది. దసరా సీజన్ ప్రారంభమయ్యే నాటికి ఇంకా ధరలు తగ్గితే బాగుండేదని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 15న మంగళవారం గోల్డ్, సిల్వర్ రేట్లు తెలుగు రాష్ట్రాలతోపాటు మెట్రో నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు రూ. 1,54,240 వద్ద ఉంది. అయితే 22 క్యారెట్ల బంగారం అయితే రూ. 1,41,400 ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములు రూ. 1,54,090 వద్ద కొనసాగుతంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,250 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి పలు మెట్రో నగరాల్లోనూ దాదాపుగా ఇవే రేట్లు ఉన్నాయి. కాకపోతే కాస్త వంద లేదా 2 వందలు అటు ఇటుగా ఉన్నాయి.
ALSO READ: కేంద్రం తీపి కబురు.. UPI యూజర్స్‌కు శుభవార్త, రూ. 2 వేలు వరకు లావాదేవీలు ఉచితం
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. సెప్టెంబర్ 15న ఉదయం 6 గంటలకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ 10 గ్రాములు రేటు రూ. 490 పతనంతో రూ. 1,54,090 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 450 తగ్గి తులానికి రూ. 1,41,250 వద్ద ఉంది. దీనికి ముందటి రోజు ధర స్థిరంగానే ఉంది. మరోవైపు వెండి ధర కాస్త ఇటు ఇటుగా స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ. 2.50 లక్షల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. 10 గంటలకు మార్కెట్ ఓపెన్ తర్వాత ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉంది.