E-Paper
Advertisement

రౌడీషీటర్ నయీమ్‌ దారుణ హత్య.. హైదరాబాద్‌లో ఓ వైన్ షాపు ముందు ఘటన, సీసీటీవీ ఫుటేజ్ సాక్షిగా

రౌడీషీటర్ నయీమ్‌ దారుణ హత్య.. హైదరాబాద్‌లో ఓ వైన్ షాపు ముందు ఘటన, సీసీటీవీ ఫుటేజ్ సాక్షిగా
Advertisement

Hyderabad: హైదరాబాద్ సిటీ‌లో దారుణం జరిగింది. ఓ వైన్ షాపు ముందు రౌడీ షీటర్‌ని వేట కొడవళ్లలో కొందరు వ్యక్తులు హత్య చేశారు. ఈ తతంగమంతా సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. అసలు ఏం జరిగింది? వెంటాడి మరీ హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

హైదరాబాద్ సిటీలో రౌడీ షీటర్ దారుణహత్య

హైదరాబాద్ సిటీలోని బండ్లగూడ ప్రాంతంలో రౌడీషీటర్‌‌ నయీమ్‌ను దారుణహత్యకు గురయ్యాడు. సోమవారం రాత్రి దాదాపు 9 గంటల సమయంలో సుప్రీమ్ వైన్స్‌ ముందు ఈ ఘటన జరిగింది. నయీమ్‌ ఎక్కడ ఉన్నాడు తెలుసుకున్న ప్రత్యర్థులు, కారులో వచ్చిన వేట కొడవళ్లను బయటకు తీసి వెంటాడడం మొదలుపెట్టారు. నాలుగు వైపులా రౌడీ షీటర్ని రౌండప్ చేశారు.

కారులో వచ్చిన దుండగులు, రౌండప్ చేసి చేసి చంపేశారు

Advertisement

ఆ సమయంలో నయీమ్‌.. వైన్ షాపు పరిసరాల్లోకి వెళ్లినా దుండగులు వదల్లేదు. ఆ వైన్స్‌లో నరికి నరికి చంపేశారు. వేటకొడవళ్లుతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు. మృతుడు నయీమ్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందున్న పోలీసులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు.

ALSO READ: అమెరికాలో తెలుగు టెక్కీ మృతి, అసలు ఏం జరిగింది?

Advertisement

కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కారులో వచ్చినట్లు నిందితులు, మళ్లీ అదే వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నగరంలోని ఏయే ప్రాంతాల మీదుగా వారు వచ్చారు? అనేదానిపై సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు.

 

 

Related News

అమెరికాలో తెలుగు టెక్కీ మృతి, అసలు ఏం జరిగింది?

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

Big Stories

Advertisement
×