E-Paper
Advertisement

‘హోటల్ ధర కంటే స్విగ్గీలో డబుల్ ధర.. ఇదిగో ప్రూఫ్’

‘హోటల్ ధర కంటే స్విగ్గీలో డబుల్ ధర.. ఇదిగో ప్రూఫ్’
Advertisement

Restaurant bill vs Swiggy bill| ఇంట్లోనే కూర్చొని మీకు ఇష్టమైన ఫుడ్‌ ఫోన్‌ ద్వారా క్షణాల్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే, ఈ సౌకర్యం కోసం మీరు ఎంత అదనంగా చెల్లిస్తున్నామో ఎప్పుడైనా గమనించారా? ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ హోటల్ బిల్ ఇదే విషయంపై చర్చకు దారితీసింది. స్విగ్గీ ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్ నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి తింటే దాదాపు సగం ఖర్చు అయిందని ఒక యూజర్ సోషల్ మీడియాలో ఆధారాలతో సహా పోస్ట్ చేశాడు.

ఒకే ఫుడ్‌కు రెండు రకాల బిల్లులు

స్విగ్గీ, రెస్టారెంట్ రెండు బిల్లుల పోలికను సోషల్ మీడియా ఎక్స్ యూజర్ @idlebrainjeevi ఇటీవల షేర్ చేశాడు. ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లో ఉన్నట్లు పోస్ట్‌లో కనిపిస్తోంది. కస్టమర్ మూడు ఫుడ్ ఐటమ్స్‌.. రెస్టారెంట్‌లో, స్విగ్గీలో ఆర్డర్ చేసి పోల్చాడు. ఆ ఆర్డర్‌లో నెయ్యి కారం ఆనియన్ దోస, నెయ్యి పొంగల్, ఫిల్టర్ కాఫీ ఉన్నాయి.

Advertisement

రెస్టారెంట్‌లో ఈ మూడు ఐటమ్స్‌కు మొత్తం బిల్లు రూ.230గా వచ్చింది. అదే ఆర్డర్‌ స్విగ్గీ ద్వారా తెప్పించుకోవడానికి రూ.436 చెల్లించాల్సి వచ్చింది. అంటే, రెండు బిల్లుల మధ్య రూ.206 తేడా కనిపించింది. ఈ పోలిక షేర్ చేస్తూ యూజర్.. “రెస్టారెంట్‌కు వెళ్లడం, స్విగ్గీ ఉపయోగించడం మధ్య తేడా ఇది” అని పేర్కొన్నాడు.

ఆన్‌లైన్ ఆర్డర్ ఎందుకు బిల్ ఎందుకు ఖరీదుగా ఉంటుంది?

ఈ పోస్ట్‌పై పలువురు సోషల్ మీడియా యూజర్లు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. కొంతమంది ఆన్‌లైన్ ఫుడ్ ధరలు ఎక్కువగా ఉండటానికి ప్లాట్‌ఫామ్ కమిషన్లే కారణమని చెప్పారు.
రెస్టారెంట్లు డెలివరీ యాప్స్‌లో ఆహారానికి వేర్వేరు ధరలను నిర్ణయించవచ్చు. ప్లాట్‌ఫామ్ కమిషన్లు, డెలివరీ ఛార్జీలు వంటి ఖర్చులను భర్తీ చేయడానికి ఇది జరుగుతుందని కొందరు పేర్కొన్నారు.
ఒక యూజర్ ప్రకారం.. కొన్ని సందర్భాల్లో ప్లాట్‌ఫామ్ కమిషన్ రెస్టారెంట్ విక్రయాల్లో ఐదో వంతు నుంచి మూడో వంతు వరకు ఉండవచ్చు. అయితే ఎంత శాతం అనేది రెస్టారెంట్, స్విగ్గీ మధ్య ఉన్న డీల్, ఆర్డర్ పరిస్థితులపై మారవచ్చు.

Advertisement

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌పై రూ.కోట్లు ఖర్చు చేసిన వ్యాపారవేత్త.. బ్రేకప్ తరువాత తిరిగివ్వాలని కోర్టులో కేసు.. చివరికి

సౌకర్యం కోసం అదనపు డబ్బు చెల్లిస్తున్నారా?

చాలామంది ఆన్‌లైన్ డెలివరీని సమర్థించారు. ఆన్‌లైన్ డెలివరీ సర్వీస్ వల్ల హోటల్ వెళ్లడానికి ట్రాఫిక్‌లో ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. పార్కింగ్ కోసం వెతకాల్సిన పని కూడా ఉండదు.
రెస్టారెంట్‌లో టేబుల్ కోసం వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. బిజీగా ఉండే వారికి ఈ సౌకర్యం అదనపు ఖర్చు వల్ల చాలా వరకు శ్రమ మిగిలిపోతుందని కొందరు అభిప్రాయపడ్డారు.
“సౌకర్యానికి కూడా ఒక ధర ఉంటుంది” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.

Also Read: వైరల్ అవుతున్న 1980 ఏఐ ఫోటో ట్రెండ్.. మీ సెల్ఫీ అప్‌లోడ్ చేస్తే ప్రమాదకరం

దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్లడమే బెస్ట్?

కొంతమంది యూజర్లు రెస్టారెంట్ దగ్గరగా ఉంటే నేరుగా అక్కడికి వెళ్లడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ప్రయాణ ఖర్చులు కలిపినా.. ఆన్‌లైన్ బిల్‌లో రహస్య ఛార్జీల కంటే తక్కువే కావచ్చని చెబుతున్నారు.

ఈ వైరల్ పోస్ట్ ఆన్‌లైన్ ఫుడ్ ధరలపై మరోసారి చర్చను మొదలుపెట్టింది. స్విగ్గీలో ఆర్డర్ చేయాలా లేదా రెస్టారెంట్‌కు వెళ్లాలా అనేది చివరికి మీ సమయం, బడ్జెట్, సౌకర్యంపై ఆధారపడి ఉంటుంది.

Related News

ఆయిల్ మార్కెట్‌లో ప్రకంపనలు.. బ్యారెల్ ధర 108 డాలర్లు, భారత్‌లో ధరలు పెరిగే ఛాన్స్?

యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం

వినాయక చవితి వేళ పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర

పిల్లల చదువులు, పెళ్లి, వైద్య ఖర్చుల కోసం EPF విత్‌డ్రా చేసుకోవచ్చా? కొత్త రూల్స్ ఇవే

బ్యాంక్ FD లేదా పోస్టాఫీస్ డిపాజిట్.. ఎందులో పెట్టుబడి చేయడం మంచిది

వైరల్ అవుతున్న 1980 ఏఐ ఫోటో ట్రెండ్.. మీ సెల్ఫీ అప్‌లోడ్ చేస్తే ప్రమాదకరం

సముద్రపు అడుగున పసిడి-వెండి ఖజానా.. చైనా శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ శోధన! హైడ్రోథర్మల్ క్షేత్రం కూడా

Big Stories

Advertisement
×