E-Paper
Advertisement

కేంద్రం తీపి కబురు.. UPI యూజర్స్‌కు శుభవార్త, రూ. 2 వేలు వరకు లావాదేవీలు ఉచితం

కేంద్రం తీపి కబురు.. UPI యూజర్స్‌కు శుభవార్త, రూ. 2 వేలు వరకు లావాదేవీలు ఉచితం
Advertisement

UPI Payments: ఆన్‌లైన్ లావాదేవీలపై కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం. డిజిటల్ చెల్లింపులపై ఏ మాత్రం ప్రభావం చూపకుండా అడుగులు వేస్తోంది. తాజాగా కోట్లాది మంది యూపీఐ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రోజువారీ అవసరాల కోసం UPI ద్వారా చెల్లింపులు చేసేవారికి దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI ద్వారా రూ.2000 వరకు చేసే లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు చెల్లింపులు-పరిష్కార వ్యవస్థల చట్టం 2007లోని సెక్షన్ 10A కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

కేంద్రం తీపి కబురు.. UPI యూజర్స్‌కు శుభవార్త

దేశంలో చిన్న షాపుల మొదలు పెద్ద వ్యాపార సంస్థల వరకు UPI చెల్లింపులు జరుగుతున్నాయి. కూరగాయలు మొదలు ట్యాక్సీలు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు చెల్లింపులు మొబైల్ ఆధారిత డిజిటల్ పేమెంట్లపై ప్రజలు ఆధారపడు తున్నారు. ఈ సమయంలో చిన్న చిన్న UPI లావాదేవీలపై ఛార్జీలు లేకుండా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తన గెజిట్ నోటిఫికేషన్‌లో UPIతోపాటు రూపే డెబిట్ కార్డులు చెల్లింపు పద్ధతులుగా పేర్కొంది. వీటి ద్వారా చేసే చెల్లింపులు.. వ్యక్తుల నుంచి స్వీకరించే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని పేర్కొంది. రూ.2,000 వరకు జరిగే UPI లావాదేవీల విషయంలో బ్యాంకులు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి రుసుము విధించకూడదని తెలిపింది. ఇటీవలకాలంలో రోజు వారీ చెల్లింపులు రూ.10 నుంచి రూ.2,000 వరకు చెల్లించే వారి సంఖ్య భారీగా ఉంది. ఇలాంటి లావాదేవీలపై అదనపు ఛార్జీలు లేకపోవడం వల్ల వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు సులువుగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలో రూ.2,000 వరకు జరిగే UPI లావాదేవీలకు సంబంధించిన పరిమితి ఉంది. అన్నిరకాల UPI లావాదేవీలకు ఈ నిబంధన వర్తించదు. కేవలం చిన్న మొత్తాల డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా చర్యలు తీసుకుంది.

కొత్త రూల్స్ అర్థం ఏమిటి?

Advertisement

కొత్త నిబంధనల ప్రకారం రూ. 2000 వరకు UPI లావాదేవీలు ఉచితం. అంతేకాదు RuPay డెబిట్ కార్డ్ చెల్లింపులకు వర్తిస్తుంది.
మర్చంట్ డిస్కౌంట్ రేట్-MDR ఇంకా అమలు చేయనప్పటికీ రూ. 2000 పైబడిన UPI లావాదేవీలపై ఛార్జీలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
పరిమిత సంఖ్యలో జరిగే UPI వ్యాపార లావాదేవీలపై నామమాత్రపు MDR విధించేందుకు ప్రభుత్వం ఆగస్టులో అవకాశం కల్పించింది. అలాంటి రుసుమును వినియోగదారులు కాకుండా వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వ్యక్తిగత చెల్లింపులు ఉచితంగా కొనసాగుతాయని తెలిపారు.

రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు

అంతర్జాతీయ ద్రవ్య నిధి నివేదిక-2025 ప్రకారం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న UPI లావాదేవీల పరిమాణం ప్రపంచంలో అతిపెద్ద రిటైల్ ఫాస్ట్-పేమెంట్ వ్యవస్థగా అవతరించింది. ఆగస్టులో రూ. 29.82 ట్రిలియన్ల విలువైన 24.51 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. అందులో గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల పరిమాణం దాదాపు ముప్పావు వంతు వాటా. పెద్ద వ్యాపార లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశం బ్యాంకులు-చెల్లింపు సంస్థలకు కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టించగలదు. ఇలాంటి రుసుములు చెల్లింపుల పరిశ్రమకు ఏటా రూ. 5,000 కోట్ల నుండి రూ. 10 వేల కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చగలవని ఆగస్టులో జెఫరీస్ అంచనా వేసిన విషయం తెల్సిందే.

Advertisement

ALSO READ: ‘హోటల్ ధర కంటే స్విగ్గీలో డబుల్ ధర.. ఇదిగో ప్రూఫ్’

Related News

‘హోటల్ ధర కంటే స్విగ్గీలో డబుల్ ధర.. ఇదిగో ప్రూఫ్’

ఆయిల్ మార్కెట్‌లో ప్రకంపనలు.. బ్యారెల్ ధర 108 డాలర్లు, భారత్‌లో ధరలు పెరిగే ఛాన్స్?

యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం

వినాయక చవితి వేళ పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర

పిల్లల చదువులు, పెళ్లి, వైద్య ఖర్చుల కోసం EPF విత్‌డ్రా చేసుకోవచ్చా? కొత్త రూల్స్ ఇవే

బ్యాంక్ FD లేదా పోస్టాఫీస్ డిపాజిట్.. ఎందులో పెట్టుబడి చేయడం మంచిది

వైరల్ అవుతున్న 1980 ఏఐ ఫోటో ట్రెండ్.. మీ సెల్ఫీ అప్‌లోడ్ చేస్తే ప్రమాదకరం

Big Stories

Advertisement
×