E-Paper
Advertisement

వినాయక చవితి వేళ పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర

వినాయక చవితి వేళ పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర
Advertisement

Gold Prices Today: వినాయక చవితి పండుగ వేళ పుత్తడి ప్రియులకు శుభవార్త. మార్కెట్లో విలువైన లోహాల ధరలు తగ్గాయి. ఈ తగ్గుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు కారణమని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ధరలు ఇంకా తగ్గుతాయా? పెరిగే ఛాన్స్ ఉందా? అంటే చెప్పలేమని చెబుతున్నారు విశ్లేషకులు. మార్కెట్లో ధరలు తగ్గటానికి కారణమేంటి? అనేది ఒక్కసారి చూద్దాం.

వినాయక చవితి వేళ పసిడి ప్రియులకు శుభవార్త

వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసేవారికి తీపి కబురు. మధ్య ప్రాచ్య ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు పెరగడం డాలర్ బలపడటం వంటి కారణాలతో సెప్టెంబర్ 14న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.94 శాతం పడిపోయి ఔన్సుకు 4,389.30 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈనెలలో ఫెడ్ సమావేశానికి ముందు ఆగస్టులో యూఎస్ సీపీఐ 3.4 శాతం పెరగడం, బులియన్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో వెండి మునుపటి ముగింపు ధర నుండి 0.94 శాతం తగ్గి ఔన్సుకు 64.57 డాలర్ల వద్ద చేరింది. ఈ ధరలకు అనుగుణంగా సెప్టెంబర్ 14న ఉదయం 10 గంటల తర్వాత బంగారం-వెండి ధరల్లో తేడా ఉండవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ధరలు, ఇండియాలో మాటేంటి?

Advertisement

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులం రూ. 1,54,730 వద్ద ఉంది. అదే 22 క్యారెట్లయితే రూ. 1,41,850 వద్ద కొనసాగుతోంది. ముంబై-24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,580 కాగా, 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 1,41,700 వద్ద కొనసాగుతోంది. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో వంద రూపాయలు అటు ఇటుగా ఉన్నాయి. దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో సోమవారం ఉదయం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,580 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,41,700 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

ALSO READ: పిల్లల చదువులు, పెళ్లి, వైద్య ఖర్చుల కోసం EPF విత్‌డ్రా చేసుకోవచ్చా? కొత్త రూల్స్ ఇవే

Advertisement

శనివారం అనగా సెప్టెంబర్ 12న రూ 160, రూ. 150, చొప్పున తగ్గాయి. మరోవైపు వెండి రేటు స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడ సిటీలో కేజీ సిల్వర్ ధర రూ. 2.50 లక్షల వద్ద ఉంది. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద ఉండగా, చెన్నైలో కాస్త ఎక్కువగా ఉంది.

Related News

పిల్లల చదువులు, పెళ్లి, వైద్య ఖర్చుల కోసం EPF విత్‌డ్రా చేసుకోవచ్చా? కొత్త రూల్స్ ఇవే

బ్యాంక్ FD లేదా పోస్టాఫీస్ డిపాజిట్.. ఎందులో పెట్టుబడి చేయడం మంచిది

వైరల్ అవుతున్న 1980 ఏఐ ఫోటో ట్రెండ్.. మీ సెల్ఫీ అప్‌లోడ్ చేస్తే ప్రమాదకరం

సముద్రపు అడుగున పసిడి-వెండి ఖజానా.. చైనా శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ శోధన! హైడ్రోథర్మల్ క్షేత్రం కూడా

1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!

మళ్లీ సమ్మె చేయనున్న బ్యాంకు ఉద్యోగులు.. అసలు సమస్య ఇదే

పుత్తడి ప్రియులకు షాక్.. అమాంతంగా పెరిగిన ధర, నేడు మార్కెట్లో ధరలు ఇవే

Big Stories

Advertisement
×