E-Paper
Advertisement

ఆయిల్ మార్కెట్‌లో ప్రకంపనలు.. బ్యారెల్ ధర 108 డాలర్లు, భారత్‌లో ధరలు పెరిగే ఛాన్స్?

ఆయిల్ మార్కెట్‌లో ప్రకంపనలు.. బ్యారెల్ ధర 108 డాలర్లు, భారత్‌లో ధరలు పెరిగే ఛాన్స్?
Advertisement

Oil Prices Hike: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు పైకి కనిపించకపోయినా ఆయిల్ మార్కెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. హౌతీల డ్రోన్ దాడుల కారణంగా కీలకమైన పైప్‌లైన్‌ను సౌదీ అరేబియా మూసివేసింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సోమవారం 3 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం ముడి చమురు బ్యారెల్‌కు సుమారు 108 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ పరిణామాల ప్రభావం భారత్‌పై పడే అవకాశముంది.

అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ప్రకంపనలు

రియాద్-మదీనా ప్రాంతాల్లోని ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడులు చేశాయి. దీనివల్ల గణనీయమైన ఆస్తి నష్టం జరిగింది. పలువురు గాయపడ్డారని సౌదీ విదేశాంగ శాఖ వెల్లడించింది. భద్రతా తనిఖీల కారణం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆయిల్ పైపు‌లైన్ మూసివేసినట్టు సౌదీ అరేబియా పేర్కొంది. దీని ద్వారా రోజుకు 5 నుంచి 7 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా చేయగలదు. నష్టం ఏ స్థాయిలో ఉందో తెలీదు. అది ఎంతకాలం పనికి రాకుండా పోతుందో క్లారిటీ లేదు. దీనివల్ల ప్రపంచ చమురు సరఫరాలో 4 శాతం వీటి ద్వారా జరుగుతుందని సౌదీ చమురు కొనుగోలుదారులు-వ్యాపారులు తెలిపారు. యాన్బులోని ఎర్ర సముద్ర ఓడరేవులో కేవలం ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఎగుమతులు కొనసాగించడానికి సరిపడా ముడి చమురు మాత్రమే ఉందని అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ సంస్థ రాయిటర్స్ రాసుకొచ్చింది.

మూడు శాతం పెరిగి, 108 డాలర్ల వద్ద ట్రేడింగ్

Advertisement

సౌదీ అరేబియాకు ఈజిప్టు ఓడరేవులలో కొన్ని అదనపు నిల్వలు ఉన్నాయి. వాటిని ఎర్ర సముద్రంలోని ఐన్ సుఖ్నా, మధ్యధరా సముద్రంలోని సిది కెరిర్ ఉన్నాయి. ఈ నిల్వలు కొన్నిరోజుల పాటు వినియోగదారులకు సరఫరా చేయగలవని పరిశ్రమకు చెందిన వర్గాలు చెప్పాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరిలో రోజుకు 10.9 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అయ్యేది. ఆగస్టులో అది 6.2 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయిందని సౌదీ అరేబియా.. ఒపెక్‌కు తెలిపింది. సౌదీ.. చమురు సరఫరా మూడు దశాబ్దాల కాలంలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిందని అంతర్జాతీయ ఇంధన సంస్థ శుక్రవారం తెలిపింది. ఈ పరిణామాల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్ పై పడింది. ఒక్కసారి మూడు శాతం ధరలు పెరిగాయి. ముడి చమురు బ్యారెల్‌కు 108 డాలర్ల వద్ద అటు ఇటుగా ట్రేడింగ్ జరుగుతోంది.

ALSO READ: యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం

Advertisement

పైప్‌లైన్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను ఒక్కసారిగా పెంచింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, ఆకస్మిక సరఫరా కొరత మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నిల్వల భద్రత తగ్గడం వంటివి కూడా భారతీయ చమురు కంపెనీల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ పరిస్థితి కొనసాగితే ముడి చమురు లభ్యత, సరఫరా – ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వారు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతమున్న అంతరాయం ఎక్కువ కాలం కొనసాగితే ప్రత్యామ్నాయ సరఫరాలను పొందడం కష్టం. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడుతుంది. చమురు కంపెనీలు ఎంత వేగంగా ప్రత్యామ్నాయాలను కనుగొంటాయనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అంతరాయం కొనసాగితే ముడి చమురు ధరలు పైపైకి ఎగబాకనున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, లాభాల మార్జిన్‌లపై ఒత్తిడిని పెరిగే అవకాశముంది. అదే జరిగితే ఇంధన ధరలు పెరిగే అవకాశముంది.

Related News

యూట్యూబ్ వీడియోలు చూసి బిజినెస్ ప్రారంభం.. నెలకు రూ.25 లక్షల ఆదాయం

వినాయక చవితి వేళ పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధర

పిల్లల చదువులు, పెళ్లి, వైద్య ఖర్చుల కోసం EPF విత్‌డ్రా చేసుకోవచ్చా? కొత్త రూల్స్ ఇవే

బ్యాంక్ FD లేదా పోస్టాఫీస్ డిపాజిట్.. ఎందులో పెట్టుబడి చేయడం మంచిది

వైరల్ అవుతున్న 1980 ఏఐ ఫోటో ట్రెండ్.. మీ సెల్ఫీ అప్‌లోడ్ చేస్తే ప్రమాదకరం

సముద్రపు అడుగున పసిడి-వెండి ఖజానా.. చైనా శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ శోధన! హైడ్రోథర్మల్ క్షేత్రం కూడా

1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!

Big Stories

Advertisement
×