Gold Price Today: అంతర్జాతీయ సంకేతాలు బంగారం మార్కెట్‌పై పడింది. గడిచిన కొద్దిరోజులు తారాజువ్వలా పైపైకి ఎదిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కిందకు దిగొచ్చాయి. మదుపరులు అమ్మకాలకు పాల్పడడంతో ధరలు పతనమయ్యాయి. ఇప్పుడున్న ధరలు కంటిన్యూ అవుతాయా? ఏమైనా హెచ్చుతగ్గులకు లోనుకావచ్చా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. సోమవారం మార్కెట్లో దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.
ప్రపంచ బులియన్ మార్కెట్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి మొదలైంది. దీని ప్రభావంతో దేశంలో బంగారం , వెండి ధరలు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పాట్ గోల్డ్ 1 శాతం పైగా పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ కఠిన వైఖరి అవలంబించిన తర్వాత గత వారం జరిగిన అమ్మకాల ఒత్తిడికి ఇది కొనసాగింపు. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడం లేదని, తిరిగి 2 శాతం లక్ష్యానికి తీసుకురావడానికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా లేవు. సెప్టెంబర్‌లో ఫెడ్ 25-బేసిస్-పాయింట్ల రేటు పెంపుకు అవకాశం ఉందని మార్కెట్లు వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికితోడు హోర్ముజ్ జలసంధిలోకి మందుపాతరలు పెట్టడానికి సిద్ధమవుతోంది ఇరాన్. రాకెట్ లాంచర్లతో అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్న తర్వాత చమురు ధరలపై కాకుండా బంగారంపై ఒత్తిడి కొనసాగింది. నెల రోజుల తర్వాత ఇలాంటి దాడి జరగడం ఇదే తొలిసారి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4440 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. మునుపటి రోజు స్పాట్ గోల్డ్ ధర 4460 డాలర్ల స్థాయిలో ఉండేది. అది కాస్త క్రమంగా తగ్గుతూ వచ్చింది. వారం కిందట 4650 డాలర్ల మార్కు దాటి ట్రేడింగ్ జరిగింది. సిల్వర్ ధర 66 డాలర్ల స్థాయిలో ట్రేడింగ్ జరుగుతోంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
ముంబైలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ. 1,58,240 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పసిడి ధర సోమవారం ఉదయం 8 గంటలకు తులం రూ. 1,45,050 వద్ద ఉంది. ఢిల్లీలో 24, 22 క్యారెట్ల పసిడి ధరలు రూ. 1,58,390, రూ. 1,45,200 వద్ద కొనసాగుతున్నాయి. చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లో రెండు నుంచి నాలుగు వందల మధ్య అటు ఇటు మారుతూ వస్తోంది.
Also Read: కొత్త ఇల్లు కొనబోతున్నారా? ఈ తప్పులు చేయకండి.. కొనేముందు ఇవి తప్పక చెక్ చేయాలి
హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం, అమరావతి, విజయవాడ నగరాల్లో సోమవారం ఉదయం 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులం రూ. 1,58,240 వద్ద ఉంది. 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1,45,050 వద్ద కొనసాగుతోంది. మార్కెట్లో ఓపెన్ అయితే ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగనున్నాయి. శనివారం రోజు వరుసగా రూ. 2890, రూ. 2650 మేరా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ. 2,42,190 పలుకుతోంది.