E-Paper
Advertisement

Gold Rate Increased: కొత్త ఏడాదిలో పరుగులు పెడుతున్న పసిడి.. నేడు తులం ఎంతంటే?

Gold Rate Increased: కొత్త ఏడాదిలో పరుగులు పెడుతున్న పసిడి.. నేడు తులం ఎంతంటే?
Advertisement

Gold Rate Increased: నిన్నమొన్నటి వరకు కాస్తంత తగ్గు ముఖం పట్టిన బంగారం ధరలు, నేడు మళ్లీ పై పైకి వస్తున్నాయి. మొన్నటి వరకు “అబ్బా.. తగ్గుతుంది కదా” అని సంబురపడ్డ వారికి నేటి ధరలు చూస్తే గజగజ వణుకు పుడుతుంది.

Advertisement

నేటీ పసిడి ధరలు ఇలా..

నేడు బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగిపోయాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,060 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,200 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,800 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 1,140 పెరిగింది.

Advertisement

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?

ఈ ధరలు ఎందుకు ఇలా ఆకాశానికి ఎక్కుతున్నాయంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న గందరగోళమే అసలు కారణం. డాలర్ విలువ పెరగడం, అటు అమెరికాలో వడ్డీ రేట్ల మీద జరుగుతున్న చర్చలు మన ఇక్కడి ధరల మీద బాగా కొడుతున్నయి. దీనికి తోడు మన దగ్గర పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తుండటంతో గిరాకీ పెరిగిపోయి, రేట్లు ఇలా చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యలో ఒక రెండు రోజులు తగ్గినట్టు అనిపించినా, మళ్లీ ఇట్ల పెరగడం చూస్తుంటే “బంగారం కొనే తరుణం మించిపోయిందా?” అని సామాన్యులు బుర్రలు పాడు చేసుకుంటున్నరు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..

హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,36,200 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..

వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,200 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,850 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,200 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,850 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..

ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,350 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,25,000 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఏపీలో మరో ట్రావెల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో ఆరుగురు!

నేటి సిల్వర్ ధరలు ఇలా..

నేడు సిల్వర్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. గత నాలుగు రోజులుగా తగ్గిన వెండి ధరలు మళ్లీ నేడు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,56,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద కొనసాగుతోంది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,42,000 వద్ద పలుకుతోంది.

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×