E-Paper
Advertisement

MohanLal Vrusshabha : మోహన్ లాల్ మూవీకి 70 కోట్ల నష్టం

MohanLal Vrusshabha : మోహన్ లాల్ మూవీకి 70 కోట్ల నష్టం
Advertisement

MohanLal Vrusshabha : 2025లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో అంటే మోహన్ లాల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ ఇయర్‌లో మోహన్ లాల్ చేసిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్స్. 2025 సమ్మర్‌లో వచ్చిన L2 : ఎంపురాన్ మూవీ 260 కోట్లకుపైగా కలెక్షన్స్ చేసి మలయాళం ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీకి రికార్డ్ క్రియేట్ చేసింది.

దీని తర్వాత ఏప్రిల్‌లో వచ్చిన తుడరమ్ మూవీ. ఇది కేవలం 28 కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కించారు. కలెక్షన్లు మాత్రం 250 కోట్ల వరకు వచ్చాయి. ఇక ఆగస్టులో వచ్చిన హృదయపూర్వం మూవీ కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన తర్వాత మోహన్ లాల్ ఈ ఏడాది ఎండింగ్… క్రిస్మస్ సందర్భంగా మరో సినిమాను రిలీజ్ చేశాడు. అదే… వృషభ.

వృషభ డిజాస్టర్…

Advertisement

హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వచ్చిన మూవీ కాబట్టి… మినిమం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ, ఈ మూవీ అందరినీ దారుణంగా నిరాశపరిచింది. ఫస్ట్ షో నుంచే యునానిమస్‌‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఏ మూమెంట్‌లో కూడా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా లేదు అంటూ రివ్యూలు వచ్చాయి.

వృషభ క్లోజింగ్ కలెక్షన్స్…

ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమాకు ఇండియాలో 60 లక్షలు.. వరల్డ్ వైడ్ 90 లక్షలు మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. దీంతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన మోహన్ లాల్ మూవీకి ఓపెనింగ్స్ కనీసం ఒక కోటి కూడా రాలేదు అంటూ ట్రోల్స్ వచ్చాయి. మొత్తం డిసెంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీకి ఇప్పటి వరకు.. క్లోజింగ్ కలెక్షన్లు కనీసం 2 కోట్లు కూడా దాటలేదు.

70 కోట్లు లాస్…

Advertisement

అయితే, వృషభ మూవీ నిర్మాణానికి దాదాపుగా 70 కోట్ల వరకు అయిందంట. దీంతో పాటు రిలీజ్ కోసం చేసిన ప్రమోషన్స్ చేసిన ఖర్చు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు అయిందని సమాచారం. ఇప్పుడు వచ్చిన కలెక్షన్లు కేవలం 2 కోట్లు మాత్రమే. అంటే… ఈ సినిమాకు 70 కోట్లకు పైగా నష్టం వచ్చింది అని అనుకోవచ్చు.

ఓటీటీ & శాటిలైట్ కూడా కష్టమే..

ఇప్పటికే 70 కోట్ల వరకు లాస్ వచ్చింది అని అనుకుంటే… దీనికి తోడు ఈ సినిమాకు ఓటీటీ, శాటిలైట్ అమ్మకాలు కూడా జరగలేదు. ఎలాంటి డీల్స్ లేకుండానే సినిమాను రిలీజ్ చేశారు. రిలీజ్ తర్వాత ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని అనుకుని… ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ చేయలేదు. ఇప్పుడు డిజాస్టర్ టాక్ రావడంతో… మూవీని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని టాక్.

మోహన్ లాల్ రెమ్యునరేషన్…

ఇంత పెద్ద డిజాస్టర్ మూవీకి మోహన్ లాల్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు అంటూ ఓ చర్చ అనేది సినిమా వర్గాల్లో నడుస్తుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం… వృషభ మూవీకి మోహన్ లాల్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదంట. కానీ, కేరళ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాడంట. ఇక సినిమాకు కేరళ థియేటర్స్ నుంచి వచ్చిన కలెక్షన్స్ కంటే… ప్రమోషన్స్ కి పెట్టిన డబ్బులే ఎక్కువ. అలా… చూస్తే మోహన్ లాల్ కి ఈ సినిమా వల్ల ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు అన్నమాట.

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×