BigTV English

Hyundai Creta EV: అదరగొడుతున్న హ్యుందాయ్ క్రెటా EV.. సింగిల్ ఛార్జ్‌తో 450 కిలో మీటర్లు!

Hyundai Creta EV: అదరగొడుతున్న హ్యుందాయ్ క్రెటా EV.. సింగిల్ ఛార్జ్‌తో 450 కిలో మీటర్లు!
Hyundai Creta EV
Hyundai Creta EV

Hyundai Creta EV gives 450km Milage in Just single Charge: దేశంలో కార్ల వినియోగం ఏరేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా రోడ్డుపైకి వెళ్లామంటే ఎటుచూసిన కార్లే కనిపిస్తాయి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా కార్లను వినియోగిస్తున్నారు. కంపెనీలు కూడా మిడ్ రేంజ్ ప్రైజ్‌లో మంచి ఫీచర్లతో కార్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా నగరాల్లో ఈవీ వెహికల్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. సిటిలో ఎటు వెళ్లాలన్నా ఈవీ వెహికల్స్‌నే ఉపయోగిస్తున్నారు. ఈవీ మార్కెట్‌లో నంబర్ వన్ స్థానం కోసం ఇప్పటికే అనేక కంపెనీలు పోడిపడుతున్నాయి.


ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తనకంటూ ప్రత్యేకత చూటుకుంది. ఇప్పటి వరకు ఎస్‌యూవీ మార్కెట్‌లో దూసుకుపోయిన కంపెనీ తాజాగా ఈవీ మార్కెట్‌పై కన్నేసింది. హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన క్రెటా ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. దీనిని ఇప్పుడు ఈవీగా మార్చి కస్లమర్లకు అందినున్నట్లు కంపెనీ వెల్లడించింది. క్రెటా ఈవీ టెస్టింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.
2024 డిసెంబర్ నెలాఖరులో మార్కెట్‌లోకి తీసుకురాన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ మోడల్‌లో 5560kWh కెపాసిటీ బ్యాటరీ సెటప్ ఉంటుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కారు ఫ్రంట్ ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్టు ఉంటుంది. దీని ICE డబుల్ అడాస్ సూట్‌తో అమర్చబడి ఉంటుంది. కారు బంపర్‌కు రేడియేటర్ గ్రిల్‌‌ను అమర్చారు. క్రెటాలో ఎలక్ట్రిక్ మోడల్ ఇంటర్ ఫేస్‌ను కలిగి ఉంటుంది. దీనికి 360 డిగ్రీ కెమెరా సెటప్ అమర్చనున్నారు.


Also Read: ఆ కారుపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 80,000 తగ్గింపు

హ్యుందాయ్ క్రెటా మంచి స్టైలిష్ డిజైన్‌తో రానుంది. ఇది క్లోజ్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. అయితే ఫేస్ లిప్ట్‌లో గ్రిల్ రేడియేటర్‌ను అమర్చనున్నారు. ఇందులో ఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్‌లు ఉపయోగించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఇందులో 17 ఇంచెస్  ఏరో డిజైన్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వీటిని ఎలక్ట్రిక్ వెహికల్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ధర రూ. 20 లక్షల పైగానే ఉండొచ్చని మార్కెట్‌లో టాక్ వినిపిస్తోంది.

Tags

Related News

Gas cylinder scams: నకిలీ సీల్, నకిలీ బిల్.. గ్యాస్ సిలిండర్ మోసాలు ఎలా గుర్తించాలి?

Mahindra BE 6: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహీంద్రా BE6.. 135 సెకన్లలో కార్లన్నీ సేల్

D-Mart: ఏంటీ? డిమార్ట్ నుంచి డబ్బులు కూడా సంపాదించవచ్చా? ఇంత సులభమా!

Investment Formula: రూ. 1.2 కోట్ల అప్పుల తీర్చి.. రూ. 5 కోట్ల సంపాదించి.. ఏం ప్లాన్ గురూ!

Americans Investments: బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా చేతినిండా సంపద.. అమెరికన్ల బుర్రే బుర్ర!

Maruti Suzuki e-Vitara: ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మారుతీ సుజుకీ ఈవీ కారు, టార్గెట్ 100 దేశాలు

Big Stories

×