Bigg Boss 9 Promo : తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో రోజుకు కొత్త ట్విస్ట్ వస్తుంది. అలానే షో కూడా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఫ్లోరా సైని, రీతు చౌదరి ఎలిమినేషన్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిలో ఒకరు ఈరోజు హౌస్ నుంచి బయటికి వెళ్ళనున్నారు. ఆ ఒక్కరు ఎవరు?
ఈరోజు జరగవలసిన ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ ప్రోమో కూడా చాలా ఆసక్తికరంగా, ఎపిసోడ్ మీద క్యూరియాసిటీ పెంచేలా ఉంది. కొత్త చాప్టర్ మొదలైంది అంటూ ఈ ప్రోమో మొదలైంది.
ఎవిక్షన్ జోన్ లో ఉన్న రీతు చౌదరి, ఫ్లోరా సైనిక్ ఇద్దరినీ కూడా బిగ్బాస్ యాక్టివిటీ రూమ్ లోకి రమ్మన్నారు. మై డియర్ హౌస్ మేట్స్ ఆ ఇద్దరిలో ఎవరు వెళ్తున్నారు గెస్ చేయగలరా అని బిగ్ బాస్ ఇమ్మానుయేల్ ను అడిగారు.
లాస్ట్ ఫైవ్ వీక్స్ నుంచి వాళ్ళిద్దరి ను క్యాలిక్యులేట్ చేస్తే ఫ్లోరా గారు వెళ్తారు అని నేను అనుకుంటున్నానని ఇమ్మానుయేల్ చెప్పాడు. ఓవరాల్ గేమ్ లో రీతూ కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టింది అని దివ్య చెప్పింది. ఇద్దరినీ కంపేర్ చేస్తూ చూస్తే రీతు స్ట్రాంగ్ అంటూ కళ్యాణ్ చెప్పాడు.
మీరు హౌస్ లో ఎవరిని మిస్ అవుతున్నారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అని బిగ్ బాస్ ఫ్లోరాను అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్ గా నేను సంజన గారికి థాంక్యూ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏడుస్తున్నప్పుడు, ఈ హౌస్ మొత్తంలో ఆవిడ నా దగ్గరికి వచ్చేవారు.
రీతు మాట్లాడుతూ పవన్ ఐ మిస్ యు సో మచ్ నిన్ను చాలా అంటే చాలా మిస్ అవుతాను బయటికి వెళ్ళిన తర్వాత అంటూ ఏడ్చేసింది. నాకు నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని లేదు అంటూ మళ్ళీ కన్నీటి టాప్ ఓపెన్ చేసింది. ఐ మిస్ యు అని చెప్పింది రేపు.
మీ ఉద్దేశం ఏమైనా కూడా ఆడియన్స్ ఉద్దేశం ఒకటి ఉంటుంది. దానిని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పేశారు. బిగ్బాస్ లైఫ్ లైన్ ఒకటి క్రియేట్ చేసి ఆడియన్స్ ఓట్స్ తో దానిని కనెక్ట్ చేశారు. ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు సేఫ్ అయినట్టు. ఎవరికి తక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు. మొత్తానికి ఈ ప్రోమోలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూపించలేదు. కానీ అందరూ చెప్పినట్లు ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Allu Arjun: ప్రైవేట్ హోటల్లో అల్లు అర్జున్ అభిమాన సంఘాలతో మీటింగ్