Gold Capital of India: భారతదేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ మరే దానికి ఉండదు. ఇక ఆడవారు అయితే బంగారం అంటే తెగ ఇష్టపడిపోతుంటారు. జస్ట్ వారికి చిన్నపాటి బంగారం గిఫ్ట్ ఇచ్చినా చాలు.. తెగ సంబరపడి పోతుంటారు. పెళ్లికైనా.. ఎంగేజ్‌మెంట్ కు అయినా గోల్డ్ ముచ్చట లేనిది ఏ కార్యక్రమం ముందుకు జరగదు. అది గోల్డ్ కు ఉన్న క్రేజ్. ప్రస్తుతం బంగారం ధర అక్షరాల లక్ష ముప్పై వేల రూపాయలు (రూ.1,30,000) ఉంది.. అయిన మనం కొనకుంటా ఊరుకుంటామా..? బంగారం రేట్ ఎంత ఉన్నా పండుగ వేళ బంగారం కొనుడే.. పెళ్లిల్లో, వేడుకల్లో ఆభరణాలు ధరించుడే.. బంగారానికి ఎందుకంత క్రేజ్ అంటే.. వందలు, వేల ఏళ్లు అయినా బంగారం రంగు మారదు. అలానే తళతళా మెరుస్తది.. అందుకే మగువలు గోల్డ్ ను ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే, భారతదేశంలో బంగారానికి సంబంధించి ఓ నగరానికి ప్రత్యేకత ఉంది. దాన్ని భారతదేశ బంగారు రాజధానిగా పిలుస్తారు. దాని పేరే త్రిశూర్ నగరం.. దీని గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
త్రిశూర్ నగరం కేరళ రాష్ట్రంలోని ఓ ముఖ్యమైన నగరం. ఇక్కడ బంగారం వ్యాపారం, తయారీ, నగల పరిశ్రమకు ఈ సిటీ ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. అందుకే దీనికి ‘భారతదేశ బంగారు రాజధాని’ (Gold Capital of India) అని అంటారు. అలాగే ఈ నగరాన్ని ‘కేరళ సాంస్కృతిక రాజధాని’ (Cultural Capital of Kerala) అని కూడా పిలుస్తారు. త్రిశూర్ నగరం బంగారం వ్యాపారంలో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించడానికి చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి
పురాతన కాలంలో రోమన్, అరబ్ వ్యాపారులు త్రిశూర్‌కు సమీపంలో ఉన్న కొడుంగల్లూర్ (Kodungallur) ఓడరేవు వద్ద ఆగిపోయేవారు. దీంతో.. ఈ వాణిజ్యం ద్వారా బంగారం నిల్వలు, నగల తయారీలో నైపుణ్యం ఈ ప్రాంతానికి సంక్రమించింది. త్రిశూర్ వందలాది బంగారు కర్మాగారాలు (వర్క్‌షాప్‌లు), నగల తయారీ కేంద్రాలకు నిలయం. వేలాది మంది నిపుణులైన చేతివృత్తులవారు (Goldsmiths) ఇక్కడ సాంప్రదాయ, ఆధునిక డిజైన్లలో బంగారు ఆభరణాలను తయారు చేస్తున్నారు.
ALSO READ: Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు
భారతదేశంలోని అతిపెద్ద జ్యువెలరీ బ్రాండ్‌లు.. ముఖ్యంగా కల్యాణ్ జ్యువెలర్స్ (Kalyan Jewellers), మలబార్ గోల్డ్ & డైమండ్స్ (Malabar Gold & Diamonds), జోస్ అలుక్కాస్ (Jos Alukkas), జాయ్ అలుక్కాస్ (Joyalukkas) వంటి వాటికి మూలాలు త్రిశూర్ నగరంలోనే ఉన్నాయి. ఈ బ్రాండ్ల విస్తరణ నగర ఖ్యాతిని పెంచింది. త్రిశూర్ బంగారం టోకు వ్యాపారానికి కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడి నుంచే కేరళతో పాటు దక్షిణ భారతదేశంలోని ఇతర చిన్న నగల దుకాణాలకు ఆభరణాలు సరఫరా అవుతాయి.
ALSO READ: Indian Railways: డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే ఎక్స్ లెంట్ లైఫ్, భారీ వేతనం
కేరళ ప్రజలకు బంగారంతో లోతైన సాంస్కృతిక బంధం ఉంది. ముఖ్యంగా విషు (Vishu), ఓనం (Onam) వంటి పండుగల సమయంలో బంగారం కొనడం శుభప్రదంగా అక్కడ ప్రాంతవాసులు భావిస్తారు. ఇది ఇక్కడి వ్యాపారానికి మరింత ఊతమిస్తుంది. కేరళ రాష్ట్రంలో ప్రతి ఏడాది సుమారు 500 టన్నులు (5,00,000 కిలోగ్రాములు) బంగారు ఆభరణాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో అత్యధిక భాగం త్రిశూర్ నగరంలోనే తయారవుతుంది. ఈ అధిక ఉత్పత్తి, తయారీ సామర్థ్యం కారణంగానే త్రిశూర్ దక్షిణ భారతదేశంలో బంగారం వ్యాపారానికి కీలక కేంద్రంగా మారింది.
బంగారం వ్యాపారం కేవలం ఆర్థిక లావాదేవీలకు మాత్రమే పరిమితం కాకుండా, ఈ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా నిలుస్తోంది.