Raashi Khanna : ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. చాలామంది ఎంట్రీ ఇస్తుంటారు ఒక సక్సెస్ కొడతారు మళ్ళీ కనిపించకుండా పోతారు. పూరి జగన్నాథ్ సినిమాల్లో చేసిన చాలామంది హీరోయిన్స్ సక్సెస్ అందుకొని కూడా ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండలేకపోయారు. కానీ మొదటి సినిమా సక్సెస్ కాకపోయినా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు పొందుకున్న స్త్రీల వంటి హీరోయిన్లు కూడా ఉన్నారు.
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్గా ఇంటర్వ్యూ ఇచ్చింది రాశి ఖన్నా. ఇప్పటికీ కూడా యాక్టివ్ గా రాశి ఖన్నా సినిమాలు చేస్తుంది. నీరజకోన దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన తెలుసు కదా సినిమాలో రాశి ఖన్నా కూడా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది రాశి ఖన్నా.
రాశి కన్నా ఒక ప్రముఖ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను రీవిల్ చేసింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి తను మాట్లాడింది. ఊహలు గుసగుసలాడే సినిమా చేస్తున్నప్పుడు తన మేకప్ అసిస్టెంట్ పవనిజం టీ షర్టు వేసుకొని వచ్చేవాడట. ఏంటి అని అడిగినప్పుడు మేడం పవర్ స్టార్ అని అరిచాడట.
తాను సినిమా షూటింగ్ చేస్తున్న తరుణంలో చాలామంది పవన్ కళ్యాణ్ స్పీచ్ వస్తుంటే సెట్ అంతా కూడా సైలెంట్ గా అది చూస్తూ ఉండే వాళ్ళట. ఈ విషయాన్ని చెప్పింది. అంతేకాకుండా రీసెంట్ గా ప్రముఖ రియాలిటీ షో కి రాశి కన్నా, సిద్దు జొన్నలగడ్డ, నీరజకోన, కృతి ప్రసాద్, వైవా హర్ష హాజరైన సంగతి తెలిసిందే.
అయితే ఆ షోలో ఎక్కువగా నవ్వడం మొదలుపెట్టింది రాశి కన్నా. సిద్దు కూడా ఒక తరుణంలో రాశి కన్నా పి ఆర్ ఏం చేసినా కూడా నువ్వు నవ్వుతూ ఉండు అని చెప్పినట్లున్నారు అని అన్నాడు. ఇదే విషయంపైన పాడ్ కాస్ట్ లో స్పందిస్తూ. నాకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవుతుంది, నాకు ఏమీ జరగకుండా నవ్వడానికి నేనేమైనా పిచ్చి ము…నా? అంటూ ఓపెన్ అయిపోయింది రాశి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మామూలుగా తెలుగులో సినిమాలు చేసినా కూడా చాలామందికి తెలుగు అర్థం కాదు. వాళ్లు తెలుగులో మాట్లాడే విధానం కూడా చాలామందికి నవ్వు తెప్పిస్తుంది. బహుశా ఆ విషయం రాశి కన్నా కు దృష్టిలో ఉండొచ్చు. అందుకే నాకు కూడా తెలుగు అర్థం అవుతుంది. నాకు తెలుగు బాగానే వచ్చు అనే ఉద్దేశంతో ఈ పాడ్ కాస్ట్ లో ఓపెన్ అయిపోయింది. ఇదేమైనా ఈ వీడియో కింద కూడా రాశి కన్నా ను పొగుడుతూ మంచి కామెంట్స్ వస్తున్నాయి. క్యూట్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.
Also Read: Anand Devarakonda: మరోసారి క్రేజీ కాంబినేషన్, మిడిల్ క్లాస్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?