Anand Devarakonda: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు ఫ్యామిలీలో కష్టపడి సెటిల్ అయిపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఇండస్ట్రీలోకి ఈజీగా లాగేయొచ్చు. ఇండస్ట్రీలోకి లాగడం వరకు మన చేతిలో ఉంటుంది కానీ కష్టపడి నిలబడి సక్సెస్ కొట్టడం ఆ సదర్ వ్యక్తి చేతిలో ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాతో విపరీతమైన క్రేజ్ సాధించుకున్న విజయ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ అని కూడా ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేశాడు.
దొరసాని అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆనంద్ కూడా హీరోగా ఎంటర్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఆనంద్ కు మాత్రం వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే వచ్చిన ప్రతి సినిమాను చేయకుండా తనకు నచ్చిన ప్రతి సినిమాను ఓకే చేస్తూ పట్టా లెక్కించాడు ఆనంద్. ఆనంద్ మంచి కథలు ఎంచుకొని ముందుకు వెళుతున్నాడు అని చెప్పడానికి ఆనంద్ నుంచి వచ్చిన సినిమాలే నిదర్శనమని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం వంటి సినిమాలు ఆనంద్ కెరియర్ లో డీసెంట్ హిట్ గా నిలిచాయి.
ప్రతి హీరోకి ఒక సినిమాతో బ్రేక్ అనేది వస్తుంది. అలా ఆనంద్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకొని బీభత్సమైన కలెక్షన్స్ వసూలు చేసింది. నిజంగా జరిగిన ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ బేబీ అనే కథను రాసుకున్నాడు దర్శకుడు సాయి రాజేష్. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. కూడా ప్రస్తుతం సినిమాల్లో బిజీగా మారిపోయింది.
బేబీ సినిమా ఆనంద్ కు విపరీతమైన సక్సెస్ ఇచ్చినా కూడా, ఆనంద్ చేసిన సినిమాల్లో ఎక్కువమంది మాట్లాడుకునేది మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకుడుగా పరిచయమైన ఆ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. సినిమా తర్వాత ఇప్పటివరకు వినోద్ ఒక సినిమా కూడా చేయలేదు.
మళ్లీ ఆనంద్ దేవరకొండ హీరోగా వినోద్ ఆనంతోజు సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కథ కూడా పూర్తయిపోయిందట. మరో వారం రోజుల్లో షూటింగ్ కి వెళ్ళనున్నట్లు కూడా సమాచారం వినిపిస్తుంది. మరోవైపు ఆదిత్య దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.
Also Read: Allu Arjun: ప్రైవేట్ హోటల్లో అల్లు అర్జున్ అభిమాన సంఘాలతో మీటింగ్