Gold rate: అయ్యయ్యో.. బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోయాయి.. ఆశా పెట్టినట్టే పెట్టి మళ్లీ చంపేసింది. శుక్రవారం బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు ఎంతో సంతోష పడ్డారు.. కానీ అది కాసేపు కూడా ఉండకుండా మళ్లీ పెరిగిపోయాయి.. ఈ మాత్రం దానికి ఎందుకు తగ్గాలి.. ఎందుకు పెరగాలని పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేటి పసిడి ధరలు..
శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,710 కాగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,260 వద్ద పలుకుతోంది.. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,13,400 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,900 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.550 పెరిగింది.. ఇలాగే బంగారం ధరలు పెరిగితే ఇంకా బంగారం షాపుల వాళ్లు వాటిని చూసి మురిసిపోవడం తప్ప ఎవ్వరు కొనరు..
అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..
బంగారం ధరలు పెరగడానికి 2025లో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభావంతో దేశాల మధ్య వాణిజ్య సమస్యలు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వాటి వల్ల బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే అమెరికా డాలర్ విలువ తగ్గడం కూడా దీనికి ముఖ్య కారణమంటున్నారు. డాలర్ విలువ పడిపోతే బంగారం ధర పెరుగుతుంది.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,24,260 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,900 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,260 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,900 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,260 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,900 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,12,200 వద్ద ఉంది.
Also Read: AI యుగం వచ్చినా.. అమ్మాయిలపై వేధింపులు ఆగవా.
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరల బాటలోనే సిల్వర్ ధరలు నడుస్తున్నాయి. వాటికన్న సిల్వర్ ధరలు మరి ఎక్కువగా పెరుగుతున్నాయి. రోజురోజుకు సిల్వర్ ఇలా పెరిగితే దీని పై కూడా మోగ్గు చూపడం తగ్గిస్తారు. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,84,000 కాగా.. శనివారం కేజీ సిల్వర్ ధర రూ.1,87,000 వద్ద కొనసాగుతుంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజీపై రూ. 3,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,77,000 వద్ద కొనసాగుతోంది.