E-Paper
Advertisement

వన్ ప్లస్, రియల్ మీ విలీనం.. ఒప్పో సబ్ బ్రాండ్‌లపై కీలక నిర్ణయం

వన్ ప్లస్, రియల్ మీ విలీనం.. ఒప్పో సబ్ బ్రాండ్‌లపై కీలక నిర్ణయం
Advertisement

OnePlue Realme Merge: వన్‌ప్లస్, రియల్‌మీ అధికారికంగా విలీనమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు త్వరలో ప్రపంచ, దేశీయ(చైనా) కార్యకలాపాలను విలీనం చేసి ఒక కొత్త ఉత్పత్తిగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సంస్థకు వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లీ జీ బాధ్యత వహించనున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్, రియల్‌మీ మార్కెటింగ్, సర్వీస్ కూడా విలీనం అవుతాయని సమాచారం. యూరప్, భారత్ లో వన్‌ప్లస్ మూసివేస్తారన్న ఆందోళనల మధ్య తాజా నివేదిక కస్టమర్లకు భారీ ఉపశమనాన్ని అందిస్తుంది.

రియల్‌మీ ఒప్పో సబ్ బ్రాండ్‌గా

వన్‌ప్లస్‌ను పీట్ లౌ, కార్ల్ పెయ్ డిసెంబర్ 16, 2013న స్థాపించారు. చైనాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలోని ఈ కంపెనీ 2014లో తన మొదటి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ వన్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 2014లో వన్‌ప్లస్ వన్ భారత మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఈ కంపెనీ ఒప్పో సబ్ బ్రాండ్‌గా పనిచేస్తుంది. అదేవిధంగా, రియల్‌మీ మే 4, 2018న ఇండిపెండెంట్ బ్రాండ్‌గా లాంచ్ అయింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత, ఈ ఏడాది ఆరంభంలో రియల్‌మీ, ఒప్పోలో విలీనమైంది.

Advertisement

ఈ విలీనంలో ఒప్పో తన సేవలను ప్రపంచ మార్కెట్ లో మరింత విస్తరించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నాయి. వన్‌ప్లస్, రియల్‌మీ విలీనంతో ఒప్పో సర్వీసులు మరింత మెరుగుపడనున్నాయి. ఒప్పో మెయిన్ బ్రాండ్, సబ్ బ్రాండ్‌లు స్పష్టమైన సమన్వయంలో పనిచేయనున్నాయి. 2025 తో పోలిస్తే.. ఈ విలీనంతో ఇప్పటికే ఫలితాలను ఇస్తుంది. ఒప్పో, రియల్‌మీ బ్రాండ్‌లు చైనా, విదేశీ మార్కెట్లలో తమ వాటాను గణనీయంగా పెంచుకుంటున్నాయి.

వన్‌ప్లస్ మూసివేత భయాలు

మార్చిలో సీఈఓ రాబిన్ లియూ రాజీనామాతో వన్‌ప్లస్ ఇండియా క్లోజ్ అవుతుందని వార్తలు వైరల్ అయ్యాయి. వన్ ప్లస్ ఇండియా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తామని అప్పుడూ ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఒప్పో గ్రూప్‌లో పదోన్నతి పొందిన రియల్‌మీ సీఈవో స్కై లీకి రిపోర్ట్ చేయమని లియూను కోరినట్లు తెలుస్తోంది. గతంలో లీ, లియూ ఇద్దరూ ఒకే హోదాలో పనిచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్లు ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

Advertisement

Also Read: గేమర్ల కోసం OnePlus సరికొత్త ప్రయోగం.. ఈ ఫోన్ కొంటే గేమింగ్ కన్సోల్‌ను ఫ్రీగా పట్టుకెళ్లొచ్చు!

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×