Tata Sierra EV Launch: టాటా మోటార్స్ FY2026లో భారతదేశంలో కొత్త EVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే సియెర్రా EV ఆటోమేకర్ అవిన్య సిరీస్ నుండి మొదటి మోడల్‌తో పాటు లాంచ్ కానుంది. ఇన్వెస్టర్ డే ప్రెజెంటేషన్‌లో కంపెనీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. కంపెనీ నుంచి అనేక ఎలక్ట్రిక్ కార్ లైనప్‌లో అనేక మోడల్‌లు రానున్నాయి. ప్రస్తుతానికి ఈ రాబోయే ఎలక్ట్రిక్ కారు గురించి కంపెనీ ఎటువంటి సమాచారం విడుదల చేయలేదు. అయితే టాటా సియెర్రా EV ఆల్ట్రోజ్ ALFA ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని టాటా వెల్లడించింది. ఇది 2020లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కూడా డిస్‌ప్లే చేశారు.
2026 ఆర్థిక సంవత్సరంలో టాటా సియెర్రా EVని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇన్వెస్టర్ డే ఈవెంట్‌లో టాటా మోటార్స్ తెలిపింది. ఈ మోడల్‌తో కంపెనీ తన EV బ్రాండ్ అవిన్య సిరీస్ మొదటి ప్రీమియం మోడల్‌ను కూడా విడుదల చేస్తుంది. సియెర్రా EV ఆటో ఎక్స్‌పో 2020లో కాన్సెప్ట్‌గా ప్రదర్శించారు. రాబోయే ఎలక్ట్రిక్ SUV కంపెనీ ALFA ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.
Also Read: మీ ప్రయాణాలకు ఇదే సేఫ్.. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన టాటా పంచ్ EV!
2023 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ మరింత అధునాతనమైన కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఇందులో 2020 కాన్సెప్ట్ ఫోర్ డోర్స్ డిజైన్‌కు వ్యతిరేకంగా ఐదు డోర్ల డిజైన్‌తో ఉంటుంది. అయితే ఆ సమయంలో కూడా కాన్సెప్ట్ గురించి పెద్దగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సియెర్రా కాన్సెప్ట్ పొడవు 4,150 మీమీ, వెడల్పు 1,820 మీమీ, ఎత్తు 1,675 మీమీ, వీల్‌బేస్ 2,450 మీమీ. టాటా సియెర్రా EV చివరి వెర్షన్ Gen2 EV ప్లాట్‌ఫారమ్‌పై బేస్ అయి ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటికే ఉన్న పంచ్ EV, రాబోయే హారియర్ EV లాగానే acti.ev ఆర్కిటెక్చర్‌ను కూడా కలిగి ఉంటుంది.
టాటా మోటర్స్ సియెర్రా EVతో పాటు అవిన్య సిరీస్ మొదటి మోడల్‌ను కూడా విడుదల చేస్తుంది. ఇది ప్రీమియం ఆల్-ఎలక్ట్రిక్ బ్రాండ్ దీని కింద అనేక మోడల్స్ త్వరలో విడుదల కానున్నాయి. అవిన్య సిరీస్‌కు SUV రేంజ్‌లో చూడొచ్చు. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR), ఎలక్ట్రిక్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా ఉంటాయి. సియెర్రా EV సింగిల్ ఛార్జ్‌తో 500 km రేంజ్ ఇస్తుంది.
Also Read: రికార్డులు బద్దలుకొట్టిన కియా.. విదేశాల్లో భారీగా పెరిగిన క్రేజ్!
టాటా మోటార్స్ రూ. 9,000 కోట్ల పెట్టుబడితో తమిళనాడులోని తమ కొత్త ప్లాంట్‌లో అవిన్య సిరీస్ కార్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్ రాణిపేటలో ఉండే అవకాశం ఉందని సమాచారం. అదనంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ EVలను తయారు చేయడానికి టాటా ప్లాంట్‌ను ఉపయోగిస్తారు. అదే సమయంలో టాటా హారియర్ EV మోడల్ FY 2025లో విడుదల చేస్తుంది. ఇది రాబోయే Curvv లాంచ్ తర్వాత కంపెనీ ఈ మోడల్‌ను తీసుకురానుంది.