Gold Rate: అయ్యయ్యో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ నేడు పెరిగాయి.. రోజు రోజుకు తగ్గుతాయి అంటే.. మళ్లీ పెరిగి బంగారం కొనేవారికి నిరాశ మిగులుస్తుంది. నిన్నమొన్నటి వరకు బంగారం ధరలు తగ్గుతాయి అన్నారు.. కానీ, మున్నాళ్ల ముచ్చటే అన్నట్లు మళ్లీ బంగారం ధరలు పెరిగిపోతున్నాయి.
నేటి బంగారం ధరలు ఇలా..
నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు.. గురువారం స్వల్పంగా పెరిగాయి.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,480 కాగా.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,910 వద్ద ఉంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,11,350 ఉండగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,750 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.430 తగ్గింది..
ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఈ మాసంలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని కొందరి చెబుతున్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగడం, పెట్టుబడిదారులకు సురక్షిత ఆస్తులపై దృష్టి కేంద్రీకరించడం వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని పలు నిపుణులు చెబుతున్నారు. కావున బంగారం కొనాలనుకునే వాళ్లు తగ్గినప్పుడు కొనడం మంచిది.. ఇప్పుడు స్వల్పంగా తగ్గింది.. కాబట్టి బంగారం కొనడం మంచిది.. లేదంటే ఇంకా ఎక్కువగా పెరిగితే మీకే నష్టం.. సో బంగారం కొనాలనుకునేవారు తొందరగా వెళ్లి కొనడం బెస్ట్..
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,21,910 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,750 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,910 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,750 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,910 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,750 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,060 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,11,900 వద్ద ఉంది.
Also Read: డ్యూటీలో తప్పులు చేస్తే చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బుధవారం వెండి ధరలతో గురువారం వెండి ధరలు పోల్చగా.. నిన్న భారీగా తగ్గిన వెండి ధరలు.. నేడు మళ్లీ పెరిగాయి.. అంటే బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు తగ్గుతున్నాయి.. అలాగే బంగారం ధరలు పెరిగినప్పుడు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,63,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,64,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.1,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,50,500 వద్ద కొనసాగుతోంది. ఎవరైనా సిల్వర్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి లేదంటే ఇంకా పెరిగింది అనుకోండి అప్పుడు కొనాలని ఉన్నా డబ్బులు ఉండవు.. సో కొనాలనుకునేవారు తొందరగా కొనండి..