E-Paper
Advertisement

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!
Advertisement

United States: ఇక భారతీయులకు అమెరికా కల చేదుగా మారబోతుందా?,  వలసదారులను అడ్డుకునేందుకు అమెరికా కొత్త రూల్స్ తెస్తుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అమెరికాకు వలస వచ్చే వారిని తగ్గించేందుకు డొనాల్డ్ ట్రంప్  నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పలు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు  ట్రంప్ యంత్రాంగం అమెరికా వీసాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ట్రంప్ యంత్రాంగం గురువారం (నవంబర్ 6, 2025) జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం, అమెరికాలో నివసించడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే, వారి దరఖాస్తులను తిరస్కరించే అధికారం వీసా అధికారులకు ఇవ్వబడింది.

Advertisement

ఈ జాబితాలో డయాబెటిస్‌ (మధుమేహం), ఒబెసిటీ (ఊబకాయం) లను ప్రత్యేకంగా ప్రస్తావించారు.వీటితో పాటు గుండె సంబంధిత వ్యాధులు (cardiovascular diseases), శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు, కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారి దరఖాస్తులను కూడా నిశితంగా పరిశీలించనున్నారు. ఈ మార్గదర్శకాల వెనుక ఉన్న ప్రధాన కారణం “పబ్లిక్ ఛార్జ్” (Public Charge) నిబంధన అని అమెరికా  అధికారులు వెల్లడించారు.

Telangana: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే.. అకౌంట్లోకి రూ.9,600

Advertisement

“పబ్లిక్ ఛార్జ్” అంటే ఏమిటంటే.. అమెరికాలోకి వలస వచ్చిన వ్యక్తి, తన జీవనాధారం కోసం లేదా వైద్య ఖర్చుల కోసం అమెరికా ప్రభుత్వ వనరులపై (ప్రభుత్వ సహాయం, మెడికేడ్ వంటివి) ఆధారపడే అవకాశం ఉంటే, వారిని “పబ్లిక్ ఛార్జ్”గా పరిగణిస్తారు.

కొత్త ఆదేశం ఉద్దేశ్యమేమిటంటే.. డయాబెటిస్‌, ఒబెసిటీ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి భవిష్యత్తులో వైద్య సంరక్షణ కోసం లక్షల డాలర్లు ఖర్చు కావచ్చు. తద్వారా వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.  ఊబకాయం వలన ఆస్తమా, స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు వంటి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోమని అధికారులకు సూచించారు. ఈ కారణంగా, వీసా దరఖాస్తుదారుడి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు “పబ్లిక్ ఛార్జ్” అయ్యే ప్రమాదం ఉందో లేదో అంచనా వేయాలని కాన్సులర్ అధికారులను ఆదేశించారు.

‘‘డయాబెటిస్‌ లేదా ఒబెసిటీ ఉన్న ప్రతి ఒక్కరికీ వీసా రాదని కాదు దీనర్థం . ఇది ఆటోమేటిక్ తిరస్కరణ కూడా కాదు. ఇది వీసా అధికారికి ఇచ్చిన గైడ్ లైన్స్ మాత్రమే. అధికారి దరఖాస్తుదారుడి మొత్తం ప్రొఫైల్‌ను (ఆర్థిక స్తోమత, వయస్సు, ఆరోగ్య బీమా, విద్య, నైపుణ్యాలు) పరిశీలించి, కేవలం వారి ఆరోగ్య పరిస్థితి కారణంగానే వారు భవిష్యత్తులో ప్రభుత్వ సహాయంపై ఆధారపడతారా లేదా అని నిర్ణయం తీసుకుంటారు. ’’ అమెరికన్ కాన్సులేట్ అధికారి ఒకరు తెలిపారు. విసా ఇంటర్వ్యూకు ముందే అలాంటి సమస్యలుంటే దరఖాస్తులో పేర్కోనాలని సూచించారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×