Teen Kills Owner| ఓ 15 ఏళ్ల అబ్బాయి తను పనిచేస్తున్న షాప్ ఓనర్ ని హత్య చేశాడు. తన తల్లి చావుకి ఓనరే కారణమంటూ పగ పెంచుకున్నాడు. అదును చూసి పొడిచి పొడిచి చంపాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో మోమో షాప్ నడుపుతు్న కపిల్ అనే 35 ఏళ్ల యువకుడు మంగళవారం సెప్టెంబర్ 3న, అపస్మారక స్థితిలో కనిపించగా.. స్థానికులు అతడిని సమీపంలో హెగ్డేవార్ ఆస్పత్రికి చేర్చారు. కపిల్ శరీరంపై కొన్ని కత్తితో పొడిచిన గాయాలున్నాయి. ఈ కారణంగా అతనికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధువారం మరణించాడు. పోలీసులు కపిల్ హత్య కేసులో సిసిటీవి వీడియోలను చూసి ఓ 15 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకరాం.. కపిల్ నేపాల్ దేశానికి చెందిన వాడు. ఢిల్లీలో అతని భార్య, పిల్లలతో నివసిస్తూ.. జీవనం సాగించడానికి ఒక మోమో షాపు నడుపుతున్నాడు. ఈ క్రమంలో కపిల్ షాపులో కొన్ని నెలలుగా ఒక మహిళ, ఆమె 15 ఏళ్ల కొడుకు పనిచేస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం కపిల్ తో అతని భార్య గొడవ పడి నేపాల్ తిరిగి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తరువాత కపిల్ షాపులో పనిచేస్తున్న మహిళకు కరెంటు షాక్ తగిలి మృతి చెందింది.
దీంతో ఆ మహిళ కుమారుడు తన తల్లి చావుకి కపిల్ కారణమని పగ పెంచుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా కపిల్.. షాపులో కరెంటు పని చేయించలేదని ఆ కుర్రాడు పోలీసులకు తెలిపాడు. తన తల్లి.. కపిల్ నిర్లక్ష్యం వల్లే చనిపోయందని అందుకే అదును చూసి కపిల్ ని చంపడానికి వెళ్లానని.. ఎవరూ లేని సమయంలో కత్తితో పలుమార్లు పొడిచివచ్చేశానని తెలిపాడు. కానీ కత్తిపోట్లకు కపిల్ చనిపోలేదు. అతడిని స్థానికులు ఆస్పత్రికి చేర్చారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కపిల్ చనిపోయాడు. పోలీసులు కపిల్ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టులో నిందితుడిని ప్రేవేశ పెడతామని చెప్పారు.
ఇలాంటిదే మరో కేసు బిహార్ లో జరిగింది. బిహార్ రాజధాని పట్నా సమీపంలోని కుజ్వా గ్రామంలో ఇటీవల పోలీసులకు ఒక యువతి, ఒక యువకుడి శవాలు లభించాయి. యువకుడిని ఎవరో పొడిచి హత్య చేసినట్లు కనిపించింది. మరోవైపు యువతిపై విష ప్రయోగం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు సిసిటీవి వీడియోలో చూసి ఆ ఇంట్లో నుంచి చివరిసారిగా బయటికొచ్చిన యువకుడిని అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో చనిపోయిన యువతి పేరు ప్రతిమా రాణి, యువకుడి పేరు అవనీశ్ కుమార్. ప్రతిమా రాణి సోదరుడు విశాల్ కుమార్ సోమవారం రాత్రి ఇంటికి వచ్చినప్పుడు.. ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించాయి. తన సోదరి అరుపులు విని త్వరగా విశాల్ అక్కడికి చేరుకోగా.. ఊహించని దృశ్యం చూశాడు. ఆ సమయంలో ప్రతిమా రాణి, తన ప్రియుడు అవనీశ్ కుమార్ తో శృంగారంలో ఉంది. అది చూసిన విశాల్ పక్కనే ఉన్న రాడ్డుతో అవనీశ్ పై దాడి చేశాడు. ఆ తరువాత ఇంట్లో ఉన్న గాజు బాటిల్ పగలకొట్టి.. అవనీశ్ కడుపులో పలుమార్లు పొడిచాడు. దీంతో అవనీశ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆ తరువాత అక్కడి నుంచి విశాల్ వెళ్లిపోయాడు. ఇదంతా కళ్ల ఎదుట చూసిన ప్రతిమా రాణి విషం తాగి చనిపోయింది. ప్రస్తుతం పోలీసులు విశాల్ కుమార్ ని హత్య కేసులో అరెస్టు చేశారు. చనిపోయిన అవనీశ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఒక్కగానొక కుమారుడని వారు తీరని దుఖంలో ఉన్నారని సమాచారం.
Also Read : సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?